సైనికులు క్రమశిక్షణకు మారుపేరు. ఇదే విషయాన్ని నిరూపించాడు కర్ణాటక గడగ్ జిల్లాలోని ఆంథూర్ బెంతుర్ గ్రామానికి చెందిన సైనికుడు ప్రకాశ్ హైగర్.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-టిబెట్ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్... జులై 3న స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేరుగా ఊళ్లోకి వెళ్లకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తన పొలంలో ట్రాక్టర్‌పై టెంట్ వేసుకుని క్వారంటైన్లో ఉన్నాడు.
ఎందుకంటే..
దేశాన్ని మహమ్మారి పట్టిపీడిస్తున్న సమయంలో దూర ప్రాంతం నుంచి ప్రయాణించి వచ్చాడు ప్రకాశ్. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉండాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న తన పొలంలోనే ట్రాక్టర్‌పై టెంట్ వేసుకుని స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. ప్రకాశ్‌ను పరీక్షించి ఎటువంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధరించారు వైద్యులు. అయినా కొద్ది రోజులు ఇలా ఉంటేనే తన కుటుంబసభ్యులకు మేలని భావించాడు ప్రకాశ్.
సరిహద్దుల్లో దేశం కోసం.. గ్రామ శివారులో కుటుంబం కోసం పొలంలో ఏర్పాటు చేసుకున్న ఆవాసం ఇదీ చూడండి:10, 12వ తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ క్లారిటీ