బంద్ పేరుతో బలవంతంగా దుకాణం మూసివేయించేందుకు ప్రయత్నించినవారికి తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు ఓ వ్యక్తి. కారం జల్లి, నిరసనకారుల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.
ఏం జరిగింది?
బంద్ పేరుతో బలవంతంగా దుకాణం మూసివేయించేందుకు ప్రయత్నించినవారికి తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు ఓ వ్యక్తి. కారం జల్లి, నిరసనకారుల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.
ఏం జరిగింది?
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై నిరసన తెలుపుతూ పలు సంస్థలు బుధవారం దేశవ్యాప్తబంద్కు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర యావత్మల్లో ఆందోళనకారులు ఓ దుకాణాన్ని బలవంతంగా మూసేయించే ప్రయత్నం చేశారు. యజమాని అందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది.
అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సహనం కోల్పోయిన దుకాణం యజమాని నిరసనకారులను చెదరగొట్టేందుకు వారిపై కారం పొడి జల్లాడు. వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇదీ చూడిండి:బ్రిడ్జ్ మ్యాన్: పింఛన్ డబ్బుతో నదిపై వంతెన