తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు రోజులుగా కృష్ణా నది మధ్యలో గొర్రెల మంద, కాపరి

కర్ణాటకలోని ఓ గొర్రెల కాపరి ఐదు రోజులుగా ఓ ద్వీపంలో చిక్కుకున్నాడు. కృష్ణా నదికి వరదలు రావడమే ఇందుకు కారణం. అతడ్ని ఒడ్డుకు చేర్చేందుకు సహాయ దళాలు ప్రయత్నిస్తున్నాయి.

By

Published : Aug 9, 2020, 1:18 PM IST

A shepherd gets stuck in the island from past 5 days due to Krishna river flood
ఓ గొర్రెల మంద, కాపరి.. ఐదురోజులు నది మధ్యలో!

ఓ గొర్రెల కాపరి.. తన మందతో సహా ఐదు రోజులుగా నది మధ్యలో ఉన్న ద్వీపంలో చిక్కుకుపోయాడు.

ద్వీపంలో చిక్కుకున్న గొర్రెల కాపరి

ఏం జరిగింది..?

కర్ణాటక యాదగిరి జిల్లా హుణసగి తాలుకాలోని గిరిజన ప్రాంతానికి చెందిన టొప్పన్న అనే వ్యక్తి 5 రోజుల కిందట గొర్రెల మందను మేపడం కోసం కృష్ణా నదిలోని ఓ ద్వీపానికి వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికెళ్దామనుకునే లోపు.. కృష్ణా నది ప్రవాహం పెరిగింది. ఇక చేసేదేమీ లేక తన గొర్రెల మందతో సహా అక్కడే ఉండిపోయాడు.

విషయం తెలసుకున్న స్థానిక తహసీల్దార్ సహాయక చర్యలు చేపట్టారు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం సాయంతో కాపరిని, గొర్రెలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

ఇదీ చదవండి:ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయుష్​ చిక్కీ'తో కరోనా పరార్​!

ABOUT THE AUTHOR

...view details