అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మాతృమూర్తి... కుమారుడి మృతదేహంతో మూడు రోజుల పాటు నివసించింది. ఈ ఘటన దక్షిణ కోల్‌కతాలో జరిగింది.
నేతాజీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రామ్‌గఢ్‌లో నివసించే సోమ్‌నాథ్ కుందు (39) అనే ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి... అంత్యక్రియలు జరిపించలేకపోయింది. మూడు రోజుల పాటు అతడి మృతదేహం పక్కనే ఉండిపోయింది.