సాగు చట్టాల రద్దు పోరాటంలో భాగంగా... గణతంత్ర దినోత్సవం రోజు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి బయలుదేరిన ఉత్తరాఖండ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు-పోలీసులకు మధ్య వివాదం ఏర్పడింది.
ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు-మండిపడ్డ రైతులు - టాక్టర్ ర్యాలీకి బయలుదేరిన రైతులను అడ్డుకున్న పోలీసులు
గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి బయలుదేరిన ఉత్తరాఖండ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.
ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు-మండిపడ్డ రైతులు
దెహ్రాదూన్ నుంచి దిల్లీకి ట్రాక్టర్‌పై వెళ్తోన్న రైతులను లచ్చివాలా ప్రాంతంలోని హరిద్వార్-దెహ్రాదూన్ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. జనవరి 26న దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు ఇటీవలే ప్రకటించాయి. ఈ ర్యాలీ వల్ల గణతంత్ర వేడుకలకు ఇబ్బంది కలగదని స్పష్టం చేశాయి.
TAGGED:
రైతులను అడ్డుకున్న పోలీసులు