తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కన్నా.. నీపై ప్రేమున్నా ముద్దాడలేకపోతున్నా' - soudi doctor

కరోనా బారిన పడ్డ రోగులకు వైద్యాన్నందించి ఇంటికి చేరాడు ఓ వైద్యుడు. తండ్రి రావటాన్ని చూసిన అతని కొడుకు.. నాన్నా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ ఆయన మాత్రం ఆ చిన్నారిని దూరంగా ఉండమని ఆపేశాడు. బాధతో బుడ్డోడి మనసు చిన్నబోవటం చూసి ఆ తండ్రి మనసు చలించిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.

A Saudi doctor returns home from the hospital, tells his son to keep his distance, then breaks down from the strain.
'నీపై ప్రేమున్నా.. ముద్దాడలేకపోతున్నా'

By

Published : Apr 1, 2020, 7:53 PM IST

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి ప్రజలందరూ తమతమ ఇళ్లలో ఉంటే.. వైద్య సిబ్బంది మాత్రం బాధితులను కాపాడటానికి శ్రమిస్తున్నారు. ఈ నిరంతర యుద్ధంలో ఆకలి దప్పికలను, అలసటను లెక్కచేయకుండా పని చేస్తున్నారు. చివరికి తమకు ప్రియమైన వారికీ దూరంగానే ఉండవలసి వస్తోంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఓ వీడియో.

సదరు వీడియోలో వైద్యుడు తన విధులను ముగించుకొని ఇంటికి వచ్చాడు.. తన కోసం వచ్చిన కుమారుడిని ముద్దాడలేక దూరంగా ఉండిపోయాడు. ఆరు సెకన్ల పాటు సాగే ఈ వీడియో నెటిజన్ల మనసును కదిలించింది.

సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడు విధులు ముగించుకొని ఇంటికి రాగా.. తమయుడు తండ్రి రావటాన్ని గుర్తించి.. పెరుగెత్తుకుంచూ వస్తాడు. తండ్రి తనను ఎత్తుకుని ముద్దాడతాడని భావించిన ఆ చిన్నారి... తనను దూరాన్నే ఆపేయటం వల్ల చిన్నపోతాడు. తన ముద్దుల కొడుకును దగ్గరకు తీసుకోలేని పరిస్థితిని భరించలేక ఆ తండ్రి కన్నీళ్లపర్యంతమవుతాడు. ప్రస్తతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది. ఇప్పటికే వేలాదిమంది వీక్షించారు. ఇది చాలా బాధాకరమైనప్పటికీ... ఆ డాక్టర్‌ రియల్‌ హీరో అని ఆ బాబుకు తండ్రి గారాబం దక్కాలని పలువురు కోరుకుంటున్నారు. ఇన్ని త్యాగాలు చేస్తున్న వారి కుటుంబాలకు అంతా మంచి జరగాలని భగవంతుడిని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details