ప్రమాదం జరిగిన అనంతరం.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇండోర్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఒక ఆర్మీ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్: రెండు కార్లు ఢీ.. ఆరుగురి మృతి - mp indore tajaji nagara acccident visuals
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.
రెండు కార్లు ఢీ.. ఆరుగురు మృతి!
జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్నాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వాపోతున్నారు అక్కడి జనం. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడి జనం.
ఇదీ చూడండి:ఆటోను తప్పించబోయి.. కాలువలోకి దూసుకెళ్లిన కారు..!
Last Updated : Oct 29, 2019, 1:00 PM IST