తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ​ ఎస్సైకు కడుపు నిండాలంటే.. చెత్త ఏరాల్సిందే! - ఎస్సై న్యూస్​

ముప్పై ఏళ్ల పాటు ఎస్సైగా ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన వారు ఏ స్థాయిలో ఉంటారో సులభంగా ఊహించవచ్చు. కుటుంబంతో సంతోషంగా మిగతా జీవితాన్ని గడిపేస్తారని ఇట్టే చెబుతారు. కానీ కర్ణాటక చిక్కబళ్లాపురకు చెందిన ఓ మాజీ ఎస్సై.. వీధుల్లో చెత్త సేకరిస్తూ జీవనం సాగించారు. ఆయన ఆ పరిస్థితిలో ఉండటానికి కారణాలేమిటి?

Rag picker
మధుసుధన్​ రావ్​

By

Published : Nov 8, 2020, 8:00 PM IST

Updated : Nov 8, 2020, 8:10 PM IST

ప్రభుత్వ ఉద్యోగం చేసి.. పదవీ విరమణ పొందిన తర్వాత కుటుంబసభ్యులతో సంతోషంగా శేష జీవితాన్ని గడపాలని అనుకుంటారు. అయితే.. అందరి జీవితాలు అలా సాఫీగా సాగిపోవు. కొందరి జీవితాల్లో కష్టాలు చుట్టుముట్టి దుర్భర పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి జీవితాన్నే అనుభవించారు కర్ణాటక చిక్కబళ్లాపురకు చెందిన ఓ రిటైర్డ్​ ఎస్సై. చెత్త ఏరుకుంటూ కడుపునింపుకునేవారు.

మాజీ ఎస్సై మధుసుధన్​ రావ్​

మధుసూధన్​ రావ్​.. బీఏలో డిగ్రీ పూర్తి చేశారు. నెలకి రూ.80 జీతంతో పోలీసు శాఖలో చేరారు. ముప్పై ఏళ్ల పాటు పలు జిల్లాల్లో ఎస్సైగా విధులు నిర్వర్తించి ఆరు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. అనంతరం బెంగళూరులోని ఉత్తరహళ్లిలో తన భార్య, పిల్లలతో ఉండేవారు. మూడేళ్ల క్రితం ఆయన భార్య మృతిచెందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు.. ఆయనతో ఇమడలేక తరుచూ గొడవపడటం మొదలుపెట్టారు. దాంతో నిరాశకు లోనైన మధుసూధన్​ రావ్​.. ఇంటి నుంచి బయటకువచ్చేశారు. చింతామనిలో యాచించటం ప్రారంభించారు.

మధుసుధన్​ రావ్​

కొన్ని నెలల పాటు యాచించిన తర్వాత.. అది తప్పుగా భావించిన ఆయన.. చెత్త ఏరుకుని విక్రయించటం ప్రారంభించారు. ప్రస్తుతం చింతామని టౌన్​లో ప్లాస్టిక్​ వస్తువులు, వాటర్​ బాటిళ్లు, ఇతర చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు.

సీఐ చొరవ..

మధుసూధన్​ రావ్​ పరిస్థితిని గమనించిన చింతామని సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ ఆనంద్​.. ఆయన గురించి పూర్తి వివరాలు సేకరించారు. ఆయన రిటైర్డ్​ ఎస్సై అని తెలిసిన వెంటనే మధుసూధన్​ వద్దకు చేరుకుని ఆశ్రయం కల్పించారు. అనంతరం సమాజంలో గౌరవంగా జీవంచేలా కొత్త పనిని చూపించారు.

మధుసుధన్​ రావ్​తో సీఐ ఆనంద్​

ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Last Updated : Nov 8, 2020, 8:10 PM IST

ABOUT THE AUTHOR

...view details