భర్త మృతితో మనోవేదనకు గురైన ఓ గర్భిణి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్ జునాగఢ్‌లో జరిగింది.
భర్త మరణం తట్టుకోలేక.. గర్భిణి ఆత్మహత్య
గుజరాత్ జునాగఢ్‌లో దారుణం జరిగింది. కొడుకుతో సహా గర్భంతో ఉన్న ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల కితం తన భర్త కరోనా ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకోవటమే కారణంగా తెలుస్తోంది.
అశోక్బాయ్ చుడాసామ, అతుల్ వ్యాస్ ఇద్దరు భార్యాభర్తలు. మాంగ్రోల్లోని మండర్ గ్రామంలో నివాసముంటున్నారు. బ్రతుకుదెరువు కోసం అశోక్.. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల అతడికి కరోనా సోకటం వల్ల జునాగఢ్‌లోని ఓ ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 23న అదే ఆసుపత్రి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అశోక్ మరణంలో షాక్ గురైంది అతని భార్య అతుల్ వ్యాస్. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.