తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క ఫేస్​బుక్​ పోస్ట్ అతడి జీవితాన్నే నాశనం చేసింది! - సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం

సామాజిక మాధ్యమాలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. అయితే వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకుమించి ప్రమాదకారిగా పరిణమిస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన అనుభవమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

facebook
facebook

By

Published : Dec 25, 2019, 3:54 PM IST

Updated : Dec 25, 2019, 7:46 PM IST

ఒక్క ఫేస్​బుక్​ పోస్ట్ అతడి జీవితాన్నే నాశనం చేసింది!

సామాజిక మాధ్యమాల వల్ల ఓ వ్యక్తి జీవితం ప్రమాదంలో పడింది. కర్ణాటక ఉడుపికి చెందిన హరీశ్ బెంగెరా.. సౌదీలోని గల్ఫ్ కార్టన్ కర్మాగారంలో ఏసీ మెకానిక్​గా పని చేస్తున్నాడు. భారత ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ చట్టాన్ని సవరించడాన్ని సమర్థిస్తూ ఫేస్​బుక్​లో ఓ పోస్ట్ పెట్టాడు. సౌదీలోని హరీశ్ సహోద్యోగులు ఈ పోస్ట్​ను అందరికీ షేర్ చేశారు. అది దేశవ్యాప్తంగా వైరల్ అయింది.

కొద్దిసేపటికే హరీశ్​కు అసలు విషయం గుర్తొచ్చింది. తన పోస్టు ఓ వర్గానికి వ్యతిరేకంగా ఉందని గుర్తించాడు. అలా చేసినందుకు సౌదీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాడు. ఫేస్​బుక్​ ఖాతాను తొలగించాడు.

ఇక్కడితోనే అయిపోలేదు..

ఖాతా తొలగించిన అనంతరం.. కాస్త కుదుటపడ్డాడు హరీశ్​. అయితే.. ఆ తర్వాత జరిగే పరిణామాలను ఊహించలేకపోయాడు. కాసరగోడుకు చెందిన ఓ వ్యక్తి హరీశ్​ పేరుతో నకిలీ​ ఖాతా సృష్టించాడు. హరీశ్​ పాత ఖాతాలానే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ ఖాతా నుంచి సౌదీ రాజుకు సంబంధించి వివాదాస్పద పోస్టులు చేశాడు. మక్కాలోనూ రామమందిరం నిర్మస్తామంటూ వ్యాఖ్యలు చేశాడు.

దేశవ్యాప్తంగా ఈ పోస్టులను వైరల్ చేశాడు ఆ వ్యక్తి. ఈ సారి సౌదీ పోలీసులు హరీశ్​ను అరెస్ట్ చేశారు.

విడిపించేందుకు ప్రయత్నాలు..

ఈ విషయమై ఉడుపి ఠాణాలో హరీశ్ భార్య, అతని స్నేహితులు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంపీ శోభను కలిసి సాయం కోరారు. మొత్తంగా హరీశ్​ను భారత్​కు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Last Updated : Dec 25, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details