తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాన్స్‌జెండర్లకూ రక్షణ కల్పించాలంటూ సుప్రీంలో వ్యాజ్యం - Transgenders asking protection in SC

ట్రాన్స్​జెండర్లకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది రీపక్​ కన్సల్​ వ్యాజ్యం వేశారు.

A petition has filed in the Supreme Court seeking protection for transgenders
ట్రాన్స్‌జెండర్లకూ రక్షణ కల్పించాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

By

Published : Sep 27, 2020, 6:40 AM IST

లైంగిక వేధింపుల నుంచి ట్రాన్స్‌జెండర్లకు, తృతీయ ప్రకృతి వ్యక్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం పురుషులు, మహిళలకు మాత్రమే లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే నిబంధనలు ఉన్నాయి.

అయితే.. తృతీయ ప్రకృతి వ్యక్తుల విషయంలో భారత శిక్షా స్మృతిలోగానీ, ఇటీవల అమల్లోకి తెచ్చిన సవరణల్లోగానీ ఎలాంటి నిబంధనలు లేవు. వీరిపై లైంగిక వేధింపులు పాల్పడేవారికి శిక్షలు లేకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని ఆరోపిస్తూ రీపక్‌ కన్సల్‌ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఇదీ చదవండి:శ్రీకృష్ణ జన్మభూమిలో ఈద్గా తొలగింపునకు పిటిషన్​

ABOUT THE AUTHOR

...view details