తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మందు'బాబు హుషారు.. ఒక్కడే రూ. 52వేల బిల్లు చేశాడు - మద్యం దుకాణాలు

దేశవ్యాప్తంగా సోమవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కర్ణాటకలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఒక్క రోజులో దాదాపు రూ.45 కట్ల సరకు అమ్ముడుపోయింది. అయితే బెంగళూరులోని ఓ వ్యక్తి మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా.. రూ.52,841 విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశాడు.

A Person buy RS 52,841 wine in bengaluru
'మందు'బాబు హుషారు.. బిల్లు రూ. 52వేల 841

By

Published : May 5, 2020, 8:22 AM IST

లాక్​డౌన్​ ఆంక్షల వల్ల ఇబ్బంది పడ్డ మందుబాబులకు ఊపిరి పీల్చుకునే రోజులు వచ్చాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మద్యప్రియులు వైన్​ షాపుల ఎదుట బారులు తీరారు. అయితే బెంగళూరులో చిక్​అడుగోడి ప్రాంతంలోని ఓ వైన్​ షాపులో ఓ వ్యక్తి రూ.52వేల 841 విలువ గల మద్యాన్ని ఒకేసారి కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మద్యం బిల్లు

మొత్తం 17రకాల బ్రాండ్లను కొనుగోలు చేశాడు ఆ వ్యక్తి. వాస్తవానికి ఒక వ్యక్తికి 2.25 లీటర్ల వైన్​, 6 బిరు బాటిళ్లను మాత్రమే విక్రయించాలనే అనుమతి ఉన్నా.. అతడు మాత్రం అంత మొత్తంలో కొనుగోలు చేయడం గమనార్హం.

ఒక్కరోజులో రూ.45కోట్లు..

నిన్న ఒక్కరోజే కర్ణాటకలో దాదాపు రూ.45కోట్ల అమ్మకాలు జరిగాయని రాష్ట్ర ఎక్సజ్​ విభాగం తెలిపింది. 3.9 లక్షల లీటర్లు బీరు, 8.5 లక్షల లీటర్ల మద్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేశారని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details