తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాఫిక్​ ఉల్లంఘనలతో బస్సు యజమానికి రూ.6.7 లక్షల ఫైన్​ - ట్రాఫిక్​ ఉల్లంఘనలతో బస్సు యజమానికి రూ.6.7 లక్షల ఫైన్​

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనల కారణంగా ఓ ప్రైవేట్​ బస్సు యజమానికి రూ.6.7 లక్షల జరిమానా విధించారు ఒడిశా అధికారులు. కేంద్రం ప్రవేశపెట్టిన మోటార్ వాహనాల చట్టం సవరణను మార్చి 1 నుంచి అమలు చేస్తోంది ఒడిశా ప్రభుత్వం.

A passenger Bus owner fined 6.7 lakh in Odisha
ట్రాఫిక్​ ఉల్లంఘనలతో బస్సు యజమానికి రూ.6.7 లక్షల ఫైన్​

By

Published : Mar 6, 2020, 10:17 AM IST

రెండేళ్లుగా పన్ను చెల్లించకుండా, రోడ్డు రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తూ బస్సు నడుపుతున్న ఓ వ్యక్తికి అధికారులు రూ.6,72,445 భారీ జరిమానా విధించిన ఘటన ఒడిశా బౌధ్​లో జరిగింది.

ఒడిశా ప్రభుత్వం మార్చి 1 నుంచి మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 'మినార్' అనే ప్రైవేటు బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఆ బస్సు యజమాని రెండేళ్లుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టలేదని గుర్తించారు. అంతేకాకుండా ఆ వాహనంపై పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయి. కనీసం బస్సుకు సంబంధించి పత్రాలు కూడా వారి వద్ద లేవు. ఫలితంగా అధికారులు బస్సు యజమానికి భారీ జరిమానా విధించారు.

ఇదీ చూడండి:యెస్​ బ్యాంక్​పై మారటోరియం- సగం వాటా ఎస్బీఐకి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details