తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ శివాలయానికి 500 ఏళ్లుగా ముస్లింలే సంరక్షకులు - telugu national news updates

అసోంలోని 500 ఏళ్ల నాటి పవిత్ర శైవ మందిరానికి ఓ ముస్లిం కుటుంబం సంరక్షణగా ఉంటోంది. 'ముస్లింలయ్యుండి మీరెందుకు శివాలయానికి సంరక్షణగా ఉన్నార'ని ఎవరైనా అడిగితే.. శివుడే తమకు ఇలా చేయమని చెప్పాడంటోంది ఆ కుటుంబం. తమ పూర్వీకుల నుంచి ఆనవాయితీగా ఈ పద్ధతి కొనసాగుతోందని అంటున్నాడు మోతీబార్​ రెహ్మాన్. ఇంతకి ఆ కథేంటో తెలుసుకుందామా?

A muslim family in assam is protecting hindu shrine for 500 years
ఆ శివాలయానికి 500 ఏళ్లుగా ముస్లీంలే సంరక్షకులు

By

Published : Feb 29, 2020, 11:38 AM IST

Updated : Mar 2, 2020, 10:51 PM IST

ఆ శివాలయానికి 500 ఏళ్లుగా ముస్లింలే సంరక్షకులు

అసోం రాజధాని గువాహటికి 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న రంగ్​మహాల్ అనే గ్రామంలో మోతీబార్​ రెహ్మాన్, ఆయన కుటుంబం నివాసముంటోంది. వారి కుటుంబం ఇస్లాం మతానికి చెందినప్పటికీ.. 5 శతాబ్దాలుగా ఓ శివాలయానికి సంరక్షకులుగా ఉంటోంది. మోతీబార్​ రెహ్మాన్​ రోజూ ఉదయాన్నే 5గంటలకు నిద్ర లేచి నమాజు చేస్తాడు. అనంతరం వారి ఇంటికి దగ్గర్లో ఉన్న పవిత్ర బుర్హా గోసైర్​ థాన్​ శివాలయాన్ని శుభ్రం చేసేందుకు వెళ్తాడు. చాలా ఏళ్లుగా ఇది ఆయన దినచర్యలో భాగం.

ఐదు శతాబ్దాల నుంచి ఆ శివాలయానికి రెహ్మాన్​ కుటుంబమే సంరక్షకులుగా ఉంటోంది. తన పూర్వీకుల్లానే మోతీబార్ కూడా​ రోజూ ఉదయం మందిరాన్ని శుభ్రం చేసి భక్తితో దీపాలను వెలిగిస్తాడు.

"నా చిన్నతనం నుంచి భగవంతుడికి ఈ సేవ చేస్తున్నాను. అంతకు ముందు మా నాన్న ఈ పని చేసేవారు. మేము ఇస్లాంను అనుసరిస్తాం. రోజూ ఈ స్థలాన్ని శుభ్రం చేసి, దీపం, ధూపం వెలిగిస్తుంటాను. ప్రస్తుతం నా వయసు పెరుగుతోంది. నా తదనంతరం నా పిల్లలు ఈ బాధ్యతలను చేపడతారని ఆశిస్తున్నా."

-మోతీబార్​ రెహ్మాన్​, ఆలయ సంరక్షకులు

శివాలయానికే రక్షకులుగా ఎందుకు?

రెహ్మాన్​ తొలి తరానికి చెందిన బోర్హన్సా అనే వ్యక్తికి ఒక రోజు శివుడు కలలో ప్రత్యక్షమయ్యాడట. తను ఈ ప్రదేశంలో ఉండాలనుకుంటున్నట్లు, ఇకపై తానుండే స్థలాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత బోర్హన్సా కుటుంబానిదే అంటూ చెప్పాడట. అంతే కాకుండా తమ కుటుంబం నుంచి మాత్రమే సేవలను స్వీకరిస్తానని శివుడు తన పూర్వికులకు చెప్పినట్లు రెహ్మాన్​ తెలిపాడు. అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ పద్ధతి కొనసాగుతోంది. ఇక్కడ కొలువై ఉన్న పరమేశ్వరుడు ప్రతి ఒక్కరి మాట వింటాడని, అందరి కోర్కెలను నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

Last Updated : Mar 2, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details