అమ్మంటే ఒక భరోసా. కోడి తన రెక్కల కింద ఎలా పొదివి పట్టుకుంటుందో.. తన బిడ్డలను కూడా మాతృమూర్తి అలాగే కాపాడుకుంటుంది. తన ఆకలి తీరడం కంటే పిల్లల కడుపు నిండితేనే ఎక్కువ సంతృప్తి చెందుతుంది. బిడ్డలకు ప్రమాదం ఎదురైతే ఉగ్రరూపం దాలుస్తుంది. వారికి సమస్య వస్తే ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర పుణెలో జరిగింది. ప్రస్తుత కరోనా వేళ కుమారుడి కోసం ఓ దివ్యాంగురాలైన తల్లి సాహసమే చేసింది. ఏకంగా 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించింది. కుమారుడిని తనవద్దకు తెచ్చుకుని స్థిమితపడింది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమరావతిలో చిక్కుకుపోయిన తన కుమారుడిని తన వద్దకు తెచ్చుకునేందుకు స్కూటీపై వెళ్లింది పుణె జిల్లా పిప్రీ చించావడ్కు చెందిన సోనూ ఖందారే. వ్యయ ప్రయాసలకు ఓర్చి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
"ఈ ప్రయాణంలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. నాలుగుసార్లు నా స్కూటీ టైర్ పంచర్ అయింది. కొన్ని సార్లు నా పెట్రోల్ అయిపోయేది. కానీ పెట్రోల్ బంక్ అందుబాటులో ఉండేది కాదు. రోడ్డు బాగాలేదు. దుమ్ము, గుంతలమయమై ఉంది. రోడ్డుపై కేవలం ట్రక్కులు, నేను మాత్రమే ఉన్నాం."
-సోనూ ఖందారే
పెట్రోల్ బంకుల్లోనే కునుకు