తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం' - చారిత్రక నిర్ణయం

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏ రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు భాజపా నేతలు. ఇది జాతీయ సమగ్రత దిశగా చారిత్రక నిర్ణయమని కొనియాడారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్​జైట్లీ. భారత్​లో జమ్ముకశ్మీర్​ను ఏకీకృతం చేసేందుకు డా.శ్యాం ప్రసాద్​ ముఖర్జీ చేసిన త్యాగానికి దక్కిన గౌరవంగా అభివర్ణించారు భాజపా నేత రామ్​ మాధవ్​.

జాతి సమగ్రత దిశగా చారిత్రక నిర్ణయం: జైట్లీ

By

Published : Aug 5, 2019, 1:26 PM IST

అధికరణ 370, 35ఏ రద్దుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కొనియాడారు పలువురు భాజపా నేతలు.

చారిత్రక నిర్ణయం: జైట్లీ

ఆర్టికల్​ 370 రద్దు జాతీయ సమైక్యత వైపుగా ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్​జైట్లీ. ప్రత్యేక హోదా వేర్పాటువాదానికి దారితీస్తుందన్నారు. ఈ పరిస్థితిని కొనసాగించడానికి ఏ దేశం అంగీకరించదని తన బ్లాగ్​లో రాసుకొచ్చారు జైట్లీ. ప్రభుత్వ నిర్ణయం జమ్ముకశ్మీర్​ ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో లాభం చేకూర్చుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను అభినందించారు.

అరుణ్​ జైట్లీ ట్వీట్​

ఏడు దశాబ్దాల కల నెరవేరింది: రామ్​ మాధవ్​

ఆర్టికల్​ 370 రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు భాజపా నేత రామ్​ మాధవ్​. భారత్​లో జమ్ముకశ్మీర్​ను పూర్తి స్థాయిలో ఏకీకృతం చేసేందుకు డా.శ్యాంప్రసాద్​ ముఖర్జీ, వేల మంది ప్రాణత్యాగాలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో.. ఏడు దశాబ్దాలుగా దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్​ నెరవేరిందన్నారు.

రామ్​ మాదవ్​ ట్వీట్​

ఇదీ చూడండి: దేశంలో ఇక 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు

ABOUT THE AUTHOR

...view details