తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చాయ్​వాలా సంబరం... ఉచిత టీ, మటన్​ విందు - bhihar

నరేంద్ర మోదీ విజయంపై సంతోషంతో బిహార్​లోని ఓ చాయ్​వాలా రోజంతా ఉచితంగా టీ అందించాడు. 100 మంది పేదలకు మటన్​తో విందు ఏర్పాటు చేశాడు. గుజరాత్ వడోదరాలో దోక్లా పంపిణీ చేపట్టారు.

చాయ్​వాలా సంబరం... ఉచిత టీ, మటన్​ విందు

By

Published : May 25, 2019, 2:57 PM IST

చాయ్​వాలా సంబరం... ఉచిత టీ, మటన్​ విందు

లోక్​సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ అఖండ విజయంపై ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బిహార్ పూర్ణియాకు చెందిన చాయ్​ దుకాణం యజమాని మహదేవ్​... తనకు సాధ్యమైన పద్ధతిలో అభిమానం చాటుకున్నాడు. మోదీ గెలిచారని తెలిసిన వెంటనే దుకాణానికి వచ్చే వారికి ఉచితంగా చాయ్​ పంపిణీ చేశాడు. రాత్రి సమయంలో తన ఇంటి సమీపంలో ఉండే సుమారు 100 మంది నిరుపేదలకు మటన్​ విందు ఏర్పాటు చేశాడు.

పూర్ణియా జైలు రోడ్డులో 1977 నుంచి చాయ్​ దుకాణం నిర్వహిస్తున్నాడు మహదేవ్​. ఎప్పటినుంచో మోదీకి అభిమాని. ఎన్నికల ఫలితంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే... 70 లీటర్ల పాలు కొనుగోలు చేశాడు. పంచదార, టీ పొడి, లవంగాలు, యాలకులతో రుచికరమైన చాయ్​ తయారు చేసి అందరికీ ఉచితంగా ఇచ్చాడు. దేశాన్ని పాలించే చాయ్​వాలాకు ఓ చాయ్​వాలా అందించే చిన్న బహుమతిగా పేర్కొన్నాడు మహదేవ్.

గుజరాత్​లో....

గుజరాత్​ వడోదరలోని కరేలిబాగ్​లో స్వీట్లు దుకాణం నిర్వహించే ఓ వ్యక్తి మోదీ విజయంపై ఇదే రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఉచితంగా దోక్లా పంచిపెట్టారు. గుజరాతీ సంప్రదాయ వంటకం రుచిచూసేందుకు వందల మంది దుకాణం ముందు వరుసకట్టారు.

ఇదీ చూడండి:16వ లోక్​సభ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details