తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశీ మహిళపై దౌర్జన్యం- కారులో నుంచి నగ్నంగా... - కర్ణాటకలో ఉగాండా మహిళపై దౌర్జన్యం

కర్ణాటకలో దుండగులు రెచ్చిపోయారు. చికిత్స కోసం బెంగళూరుకు వచ్చిన ఓ విదేశీ మహిళను బెదిరించి విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే మహిళను వివస్త్రను చేసి బయటకు తోసేశారు.

A mob threw the Uganda women from the car in a Nude position
విదేశీ మహిళపై దౌర్జన్యం- కారులో నుంచి నగ్నంగా...

By

Published : Jan 21, 2020, 8:35 PM IST

Updated : Feb 17, 2020, 9:58 PM IST

కర్ణాటకలో నలుగురు దుండగులు ఓ విదేశీ మహిళపై దాడి చేసి డబ్బులు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. కిడ్నీలో రాళ్ల సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఉగాండాకు చెందిన మహిళ... చికిత్స నిమిత్తం బెంగళూరుకు వచ్చారు. నవ్​జ్యోతి స్ట్రీట్​ నుంచి కమ్మనహళ్లి ప్రాంతానికి వెళ్లడానికి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ప్రైవేటు క్యాబ్​ బుక్ చేసుకున్నారు.

కారులో ఉన్న నలుగురు... కాస్త దూరం వెళ్లాక ఆమెను కత్తితో బెదిరించారు. మహిళ నుంచి బంగారం, నగదు, ఇతర విలువైన సామగ్రిని దుండగులు లాక్కున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మహిళను వివస్త్రను చేసి అలహళ్లి ప్రాంతంలో కారులోనుంచి బయటకు తోసేశారు. వెంటనే దగ్గర్లోని ఇంట్లోకి వెళ్లిన మహిళ... తన పరిస్థితిని వివరించి సాయం చేయాలని అభ్యర్థించింది. వారిచ్చిన దుస్తులు ధరించి పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: వణికిస్తున్న రాకాసి వైరస్- దిల్లీ ఎయిర్​పోర్ట్​లోనూ పరీక్షలు

Last Updated : Feb 17, 2020, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details