నచ్చిన బాలుడిని మనువాడేందుకు ఒప్పుకోవాలంటూ మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక నడి రోడ్డుపై గందరగోళం సృష్టించింది. పెళ్లికి తన తల్లి అంగీకరించలేదని ఎత్తైన హోర్డింగ్పైకి ఎక్కేసింది. ఇండోర్‌లోని పర్దేశిపురలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
పెళ్లి కోసం హోర్డింగ్పైకి ఎక్కేసిన బాలిక - hoarding mp girl marriage
తను ఇష్టపడే బాలుడితో వివాహానికి తల్లి అడ్డు చెప్పిందని ఓ మైనర్ హల్చల్ చేసింది. ఎత్తైన హోర్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానని బెదిరించింది. చివరకు తనకు నచ్చిన బాలుడే నచ్చజెప్పడం వల్ల దిగొచ్చింది.
పెళ్లికి ఒప్పుకోలేదని హోర్డింగ్పైకి ఎక్కేసిన బాలిక
హోర్డింగ్ పైకి ఎక్కిన బాలిక కిందకు దూకేస్తానని కుటుంబ సభ్యులను బెదిరించింది. దీంతో స్థానికులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చివరకు ఆ బాలుడు వచ్చి నచ్చజెప్పడం వల్ల మైనర్ దిగొచ్చిందని పర్దేశిపుర స్టేషన్ ఇంఛార్జ్ అశోక్ పాటీదార్ తెలిపారు.
ఇదీ చదవండి:మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్