మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు పోలీస్ చెక్పోస్టే కల్యాణ మండపమైంది. పోలీసులే పెళ్లి పెద్దలయ్యారు.
వాశీం జిల్లాకు చెందిన అరవింద్ ఆత్మారామ్కు.. పక్క జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే పెళ్లి చేసుకుందామని ఇన్నాళ్లుగా వేచిచూశాడు అరవింద్. కానీ, ప్రభుత్వం లాక్డౌన్ పొడిగిస్తూనే ఉందని విసుగు చెంది పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు. అయితే, పెళ్లిరోజున వరుడి అలంకరణలో వధువు ఇంటికి బయల్దేరిన అరివింద్ను జిల్లా చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.