తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డుపై నాణేలు తీసుకున్నందుకు గృహనిర్బంధం

కరోనా కాలంలో ఏదైనా వస్తువును తాకాలంటే చాలా మంది భయపడుతున్నారు. కానీ డబ్బుల విషయానికి వచ్చేసరికి కొంత ఆలోచిస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు చేస్తున్న పనికి అమాయకులు బుక్కవుతున్నారు. కర్ణాటకలో ఇలాగే గుర్తుతెలియని దుండుగుడు రోడ్డుపై విసిరిన నాణేలను తీసుకున్నందున ఓ వ్యక్తికి గృహనిర్బంధం విధించారు అధికారులు.

MYSURU STORY
రోడ్డుపై నాణేలు తీసుకున్నాడని గృహనిర్బంధం విధింపు

By

Published : Apr 23, 2020, 4:22 PM IST

Updated : Apr 23, 2020, 4:40 PM IST

కర్ణాటక మైసూరు నగరంలో నాణేలు కలకలం రేపాయి. సీబయ్య రోడ్డులో రోజూ రాత్రి వేళల్లో ఓ దుండగుడు వీధుల్లో నాణేలు చల్లుతున్నాడు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తి విచిత్ర చర్యతో స్థానికుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.

సైకిల్​పై వెళుతూ..

ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. సైకిల్​పై వచ్చిన ఓ వ్యక్తి రోడ్డుపై నాణేలు విసిరి వెళ్లిపోయాడు. అయితే స్థానికంగా ఛాయ్​ హోటల్​ యజమాని బాబు.. ఓ రోజు ఆ నాణేలను తీసుకోవడం సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది.

రోడ్డుపై నాణేలు తీసుకున్నందుకు గృహనిర్బంధం

బాబుకు గృహ నిర్బంధం..

ఈ విషయంపై కాలనీవాసులు ఫిర్యాదు చేయగా.. అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై నాణేలు తీసుకున్న బాబును గృహ నిర్బంధంలో ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. ఆ వీధిని క్రిమీ సంహారక మందులతో పిచికారి చేశారు.

క్రిమీ సంహారక మందులు చల్లుతున్న సిబ్బంది

నాణేలు విసిరిన దుండగుడిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Last Updated : Apr 23, 2020, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details