తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య కోసం మెడలో బాంబుల దండ.. బిడ్డతో పోలీసుల ఆపరేషన్ - నాటు బాంబుల దండను మెడలో వేసుకొని పెట్రోలు డబ్బాతో

'నా భార్యను కాపురానికి పంపిస్తారా లేదా బాంబులతో నన్ను పేల్చుకోమంటారా?'... తమిళనాడులో ఓ వ్యక్తి తన అత్తమామల దగ్గరకు వెళ్లి అన్న మాటలు ఇవి. మెడలో నాటుబాంబుల దండను పూలమాలలా ధరించి తన భార్యను పంపించమని అత్తమామలను బెదిరించాడు. అసలేం జరిగింది?

నా భార్యను పంపించకోపోతే బాబులతో పేల్చుకుంటా

By

Published : Sep 23, 2019, 10:38 AM IST

Updated : Oct 1, 2019, 4:18 PM IST

నా భార్యను పంపించకోపోతే బాబులతో పేల్చుకుంటా

భార్యను కాపురానికి పంపాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి నాటుబాంబుల దండను మెడలో వేసుకొని వెళ్లి అత్తమామలను బెదిరించాడు. తమిళనాడు కడలూరు జిల్లాలోని నైవేలిలో ఈ ఘటన జరిగింది.

మణికంఠన్‌ అనే వ్యక్తికి తన భార్యతో విభేదాలు రావడం వల్ల ఏడాదిన్నర నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది.

తాజాగా మణికంఠన్‌ నాటు బాంబుల దండను మెడలో వేసుకొని కిరోసిన్ డబ్బాతో భార్య వద్దకు వెళ్లాడు. తన భార్యను కాపురానికి పంపాలని లేదంటే బాంబులు పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని అత్తమామలను బెదిరించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు.

అటువైపు వెళ్తున్న ఓ కానిస్టేబుల్... ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మణికంఠన్​కు నచ్చజెప్పేందుకు పదునైన వ్యూహం అమలు చేశారు. అతడి​ రెండేళ్ల కుమారుడ్ని రంగంలోకి దింపారు. ఆత్మహత్య ఆలోచన విరమించుకోవాలని నచ్చజెప్పారు. ఏడుస్తూ, తనవైపు వస్తున్న రెండేళ్ల కుమారుడ్ని చూసి మణికంఠన్ చలించిపోయాడు. బాంబులు తీసి పక్కన పడేసినా... తాను అప్పటికే విషం తాగినట్లు చెప్పాడు. హుటాహుటిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: భారత్​తో కలిసి ముందుకు సాగుతాం: ట్రంప్

Last Updated : Oct 1, 2019, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details