దేశంపై ఉన్న భక్తితో తమ పిల్లలకు యోధుల పేర్లు పెట్టుకోవడం సహజం. కానీ రాజస్థాన్‌కు చెందిన వినోద్ జైన్.. తన తనయుడికి 'కాంగ్రెస్ జైన్' అని నామకరణం చేసి హస్తం పార్టీ మీద తనకున్న భక్తిని చాటుకున్నారు.
'కాంగ్రెస్'కే అంకితం...
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన వినోద్... ఆ రాష్ట్రముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కార్యాలయంలోని మీడియా విభాగంలో ఉద్యోగి. 2019లో జన్మించిన తన రెండో సంతానానికి కాంగ్రెస్ అని పేరు పెట్టారు. ఏడాది వయస్సు నిండిన 'కాంగ్రెస్'.. ఇప్పుడు నవ్వులొలుకుతూ కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపుతున్నాడు.
ఎన్నో ఏళ్లుగా తన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తోందని.. భవిష్యత్ తరాలు కూడా అదే విధంగా ముందుకు సాగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు వినోద్.
"నా కుమారుడ్ని కాంగ్రెస్ అని పిలవడానికి కుటుంబంలోని కొందరు ఇష్టపడలేదు. కానీ నేను వెనుకాడలేదు. వారిని ఒప్పించా. గతేడాది జులైలో నా కుమారుడు జన్మించాడు. కానీ జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు 'కాంగ్రెస్ జైన్' అనే పేరుతో ప్రభుత్వం ధ్రువీకరణ పత్రం జారీ చేసింది."
-వినోద్ జైన్
తాను ఎన్నో సంవత్సరాలుగా గహ్లోత్ వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు వినోద్. 'కాంగ్రెస్'కు 18ఏళ్లు నిండిన తర్వాత అతడు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి హస్తం పార్టీకి సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
బుడతడి పేరు 'కాంగ్రెస్'... వయస్సు ఏడాది ఇదీ చూడండి-దారుణం: చిన్నారికి మద్యం తాగించి హింసించిన తల్లి