గాజు ముక్కలని గారెలు తిన్నట్టే తినేస్తున్నాడు! మధ్యప్రదేశ్ డిండోరీ శాహపురలోని బర్గావ్కు చెందిన దయారామ్ సాహూ రోజుకు అరకిలో నుంచి కిలో గాజు పెంకులు అవలీలగా తినేస్తున్నాడు.
సీనియర్ అడ్వకేట్ అయిన సాహూకు గాజు ముక్కలంటే నోరూరిపోతుంది. చిన్నప్పటి నుంచే గాజు తినే అలవాటు ఉంది. 40, 45 సంవత్సరాల నుంచి ఇలాగే తింటున్నాడు.
బాల్యంలో భిన్నంగా ఏదైనా చేయాలన్న తపనతో గాజు పెంకులు తిన్నాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఆపై వ్యసనంగా మారింది. కానీ, వయసు పెరిగే కొద్ది దంతాలు దృఢత్వం కోల్పోయాయి. అందుకే మెల్లిగా గాజులు నమలడం మానేయాలనుకుంటున్నారు రామ్.
"గాజు ముక్కలు ఎవ్వరూ తినకూడదు. గాజు జీర్ణం అయ్యే పదార్థం కాదు. తినేప్పుడు గొంతులో ఇరుక్కున్నా, తెగినా చాలా ప్రమాదం. దీనితో అల్సర్ కూడా వస్తుంది. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. గాజు వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ఆరోగ్యం దెబ్బతింటుంది."
-డా. సత్యేంద్ర పరస్తే
ఇదీ చూడండి:రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్కు మహీంద్రా భరోసా