ఎవరైనా ఇష్టమైన దేవుళ్ల కోసమో, తల్లిదండ్రుల జ్ఞాపకార్థమో, రాజకీయ నాయకులపై ప్రేమతోనో ఆలయాలు నిర్మించుకోవడం చూశాం. కానీ కర్ణాటకకు చెందిన ఓ జంతుప్రేమికుడు తన పెంపుడు కుక్క జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు నిత్యం పూజలు కూడా చేస్తున్నాడు
కర్ణాటకలోని రాణిబెన్నూరుకు చెందిన చంద్రశేఖర స్వామికి శునకాలంటే అమితమైన ప్రేమ. 13ఏళ్ల క్రితం ఓ కుక్కను పెంచుకున్నాడు. ఆ కుక్కకు రాజా అని పేరు పెట్టాడు. రాజా అంటే స్వామికే కాదు.. అతని కుటుంబసభ్యులకు ఎనలేనిప్రేమ. ఐతే వయసురీత్యా శునకరాజం చనిపోయింది. శునకం మీద ప్రేమతో ఇంటి దగ్గరే గుడి కట్టించాడు. గ్రామ సింహం ప్రతిమకు నిత్యం పూజలు చేస్తూ ప్రేమ చాటుకుంటున్నాడు. అంతేకాకుండా శునక ప్రతిమకు వెనుకభాగంలో శివుడి విగ్రహాన్ని పెట్టి కుక్కను రుద్రుని స్వరూపంగా భావించి పూజలు చేస్తున్నాడు.