తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూట్యూబ్​ సాయంతో ప్రసవానికి యత్నం.. యువకుడు అరెస్ట్​ - You-tube

యూట్యూబ్​ చూసి ప్రియురాలికి ప్రసవం చేయాలని యత్నించి ఓ యువకుడు కటకటాల పాలైన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

A man arrested for attempting partner's delivery with the help of Youtube
యూట్యూబ్​ సహాయంతో ప్రసవానికి యత్నం.. యువకుడు అరెస్ట్​

By

Published : Mar 19, 2020, 11:32 PM IST

యూట్యూబ్​.. ఈ పేరు తెలియనివారు ఉండరు. దీనిని చూసి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. విద్య, వైద్యం, శాస్త్రం, సాంకేతిక విషయాలు ఒకటేంటి ఏదైనా నేర్చుకోవచ్చు. అయితే ఓ యువకుడు యూట్యూబ్​ చూసి ఏకంగా తన ప్రేయసికి శస్త్రచికిత్స చేయడానికి ప్రయత్నించాడు. అది విఫలమై పురిటిలోనే పసికందు ప్రాణాన్ని బలిగొన్నాడు. వైద్యులిచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన చెన్నైలోని గుమ్మడిపూండిలో చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది!

చెన్నైలోని గుమ్మడిపూండికి చెందిన సౌంధర్​ అనే 27ఏళ్ల యువకుడు ఓ ప్రైవేటు గ్యాస్​ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. సౌంధర్​కు ఓ కళాశాల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. అది అక్కడితో ఆగలేదు. వారిద్దరు శారీరకంగా దగ్గరై ఆ యువతి గర్భం దాల్చింది.

శస్త్రచికిత్స విఫలం!

విషయం తెలిసినా ఎనిమిదో నెలలు వరకు బాగానే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఏమైందో గానీ ఎవరికి తెలియకుండా నెలలు నిండని పసికందును పురిటిలోనే చిదిమేయాలనే దుర్మార్గపు ఆలోచన సౌంధర్​కు వచ్చింది.​ దీంతో యూట్యూబ్​ చూసి తానే స్వయంగా శస్త్రచికిత్స చేయాడానికి పాల్పడ్డాడు. కానీ అది విఫలమైంది. పసికందు ప్రాణాల మీదకు వచ్చింది. ఆ యువతి పరిస్థితి కూడా విషమించడం వల్ల దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.

వైద్యులు ఎంతో చాకచక్యంగా శస్త్రచికిత్స చేసినప్పటికి చిన్నారిని రక్షించలేకపోయారు. వైద్యాధికారులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సౌంధర్​ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యూట్యూబ్​ సహాయంతో ప్రసవానికి యత్నం.. యువకుడు అరెస్ట్​

ఇదీ చూడండి:'నిత్యావసరాలపై ఆందోళన వద్దు.. ఒకేసారి కొనిపెట్టుకోకండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details