జల్లికట్టు అనగానే గుర్తొచ్చేంది తమిళనాడు. ఈ పోటీలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తమిళ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఈ క్రీడల కోసం ఏడాది పొడవున ఎదిరి చూస్తారు తమిళ తంబీలు. మొదట మదురై జిల్లాలోని అవనైపురంలో పోటీలు నిర్వహించిన తర్వాత.. పలమెడు, అలంగనల్లూర్ పంచాయతీల్లో నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీలు జరుగుతాయి.
ఈ పోటీల కోసం కొన్ని నెలల ముందు నుంచే తమ ఎద్దులను సిద్ధం చేస్తుంటారు. జల్లికట్టు పోటీలపై ఆసక్తి పెంచుకున్న మదురైకి చెందిన 9వ తరగతి విద్యార్థిని దర్శిని.. తన వృషభాన్ని సిద్ధం చేస్తోంది. దానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. పోటీలో దిగితే తన ఎద్దు సత్తాఏంటో చూపుతుందని పేర్కొంటోంది దర్శిని.
"నాకు పదేళ్ల వయసు నుంచి జల్లికట్టు పోటీల్లో పాల్గొంటున్నా. గత నాలుగేళ్ల నుంచి ఈ ఎద్దును పెంచుతున్నా. దీనిని ఎద్దు అని సంభోదించటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది మా కుటుంబంలో భాగమే. రోజు పాఠశాలకు వెళ్లే ముందు, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దానికి మేత అందిస్తాను. మా వృషభం అందరితో ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటుంది. కానీ ఒక్కసారి రంగంలోకి దిగితే తన సత్తా ఏమిటో చూపిస్తుంది."
- దర్శిని విద్యార్థిని.