వరదాన్ క్వారీ వద్ద అదుపుతప్పి ఓ కుంటలో పడబోయిన ఈ లారీ చిన్న రాయి ఆధారంతో చాలా సేపు గాల్లో వేలాడింది. డ్రైవర్ రఘురామన్ ప్రాణాలుఅరచేత పట్టుకుని అలానే ఉండిపోయాడు. కాస్త తేడావచ్చి వంద అడుగుల లోతున్న ఈ కుంటలో పడితే అంతే సంగతులు.
100 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన లారీ - తమిళనాడు
సామర్థ్యానికి మించి గ్రానైట్ మోసుకెళ్తోంది ఓ లారీ. అదుపు తప్పి 100 అడుగులు లోతున్న కుంటలోకి దూసుకెళ్లింది. మధ్యలో ఓ రాయి ఆధారంతో గంటల తరబడి అలానే గాల్లో వేలాడింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
100 అడుగుల ఎత్తున గాల్లో వేలాడిన లారీ
సమాచారం అందుకున్న తిందివనం అగ్నిమాపక సిబ్బంది క్షణాల్లో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మొదట లారీలో చిక్కుకున్న డ్రైవర్ రఘురామన్ను సురక్షితంగా కాపాడారు. అనంతరం లారీనీ చాకచక్యంగా బయటకు తీశారు.
ఇదీ చూడండి: సర్కారు బడిలో కంప్యూటర్ చదువులు
Last Updated : Sep 28, 2019, 5:15 PM IST