కర్ణాటక మైసూర్లో ఓ చిరుత పులి.. నీళ్లు లేని బావిలో పడిపోయింది. మూడు రోజులు శ్రమించి సీసీటీవీ ద్వారా గుర్తించి చిరుతను బయటకు తీశారు అటవీశాఖ అధికారులు.
బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! మైసూర్, హెచ్డీ కోటే తాలూకా, కారపుర గ్రామంలో ఓ చిరుత కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. చిరుత కోసం అధికారులు రెండు రోజులు తీవ్రంగా గాలించారు. అది బావిలో పడిందని తెలుసుకున్నారు. బావి దగ్గరకు వెళ్లి.. చిరుత కోసం వెతికారు కానీ కనిపించలేదు.
బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! బావిలో నిచ్చెన వేసి ఓ అధికారిని బోన్లో కూర్చోబెట్టి మరీ కిందికి పంపి.. చిరుత జాడను కనిపెట్టే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేదు. చివరిగా సీసీ కెమెరాను ఓ తాడుకు కట్టి.. బావిలోకి వదిలారు. ఓ సందులో దాక్కున్న చిరుతను సీసీటీవీ మానిటర్లో గమనించారు అధికారులు. ఆపై వలవేసి జాగ్రత్తగా బయటకుతీశారు.
బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! బావిలో పడిన చిరుత.. మూడు రోజులకు చిక్కింది! ఇదీ చదవండి: దారి తప్పింది... దాడికి దిగింది..