తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ను లెక్కచేయని ప్రజలు- రద్దీగా మార్కెట్లు

దేశంలోని 80 జిల్లాల్లో లాక్​డౌన్​ అమలులో ఉంది. అత్యవసర, నిత్యావసర దుకాణాలకు మినహాయింపు ఇచ్చాయి ప్రభుత్వాలు. అయితే ప్రజలు పాలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది.

lockdown
లాక్​డౌన్​ను పట్టించుకోని ప్రజలు- మార్కెట్లు రద్దీ

By

Published : Mar 23, 2020, 12:03 PM IST

Updated : Mar 23, 2020, 1:51 PM IST

లాక్​డౌన్​ను లెక్కచేయని ప్రజలు- మార్కెట్లు రద్దీ

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​లను ప్రజలు అతిక్రమిస్తున్నారు. అత్యవసర, నిత్యావసర దుకాణాలకు ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు. ఎలాంటి స్వీయ భద్రత పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో మార్కెట్
కేరళ త్రివేండ్రంలో లాక్​డౌన్​ను పట్టించుకోని ప్రజలు
దిల్లీ అజాద్​పుర్​ మండీలో కిటకిటలాడుతోన్న మార్కెట్
ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ మార్కెట్లో రద్దీ

దిల్లీలో...

దేశ రాజధాని దిల్లీలో లాక్​డౌన్​ నడుస్తోంది. ఈ ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకూ అత్యవసరసేవలు మినహా అందరూ బంద్​ పాటించాలని కేజ్రీ సర్కార్​ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడక్కడా ప్రజలు యథేచ్చగా బయటకు వస్తున్నారు.

పంజాబ్​లో...

పంజాబ్​ రాష్ట్రం అంతా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ప్రజలు ఉదయాన్నే పాలు, ఇతర అత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దుకాణాలు మూసే ఉన్నాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో...

ఉత్తర్​ప్రదేశ్​ 16 జిల్లాల్లో లాక్​డౌన్​ విధించింది యోగి ఆదిత్యనాథ్​ సర్కార్. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు ఆంక్షలు కొనసాగుతాయని సర్కార్​ ప్రకటించింది.

లఖ్​నవూలో పరిసరాలు శుభ్రం చేస్తోన్న సిబ్బంది
లఖ్​నవూలో పరిసరాలు శుభ్రం చేస్తోన్న సిబ్బంది

అయితే రాష్ట్రంలోని పలుచోట్ల కూరగాయలు, కిరాణా దూకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. నిత్యావసరాల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.

కాన్పుర్​ మార్కెట్​ కిటకిట

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలోని అహ్మదాబాద్, ఔరంగాబాద్, ముంబయి, ముంబయి సబర్బన్, నాగపుర్, పుణె, రత్నగిరి, రాయగఢ్​, ఠాణె, యావత్మాల్​లో లాక్​డౌన్​ అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని బంద్​ పాటిస్తున్నాయి.

తమిళనాడు...

తమిళనాడులోని చెన్నై, ఎరోడ్, కాంచీపురంలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువుల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. అవి మాత్రమే తెరిచి ఉంచారు. మిగతా దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

Last Updated : Mar 23, 2020, 1:51 PM IST

ABOUT THE AUTHOR

...view details