తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యలో రామమందిరానికై 27 ఏళ్లుగా ఉపవాసం! - అయోధ్య రామమందిరానికై మహిళ ఉపవాసం

ఈ రోజుల్లో వారానికోసారి ఉపవాసం ఉండి 'దేవుడా నాకు ఉద్యోగం రావాలి,  బంగారం కావాలి, పెళ్లి కావాలి, సంపాదన కావాలి' అంటూ స్వలాభాలు ఆశించేవారే ఎక్కువ. అయితే మధ్యప్రదేశ్​లో మాత్రం దేవుడికి నిలువ నీడ కావాలని కోరుకుంది ఓ భక్తురాలు.  రాముడి గుడి నిర్మాణం కోసం 27 ఏళ్లుగా ఉపవాసం ఉంటోంది. ఎట్టకేలకు సుప్రీం తీర్పుతో త్వరలో ఆమె దీక్ష విరమించనుంది.

అయోధ్యలో రామమందిరానికై 27 ఏళ్ల ఉపవాసం!

By

Published : Nov 11, 2019, 10:56 AM IST

Updated : Nov 11, 2019, 10:49 PM IST

అయోధ్యలో రామమందిరానికై 27 ఏళ్లుగా ఉపవాసం!
మధ్యప్రదేశ్​లో 27 ఏళ్లుగా ఉపవాస దీక్షలో ఉన్న ఓ వృద్ధురాలు సుప్రీం తీర్పుతో దీక్ష విరమించినుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని 1992 నుంచి ఆమె ఈ దీక్ష చేస్తూ వస్తోంది.

ఆప్పుడూ.. ఇప్పుడూ

రామాయణంలో లక్ష్మణుడు అన్న రాముడితో కలిసి వనవాసాలకు బయలుదేరినప్పుడు.. లక్ష్మణుడి భార్య ఊర్మిళ తానూ వస్తానని మొండికేసింది. కానీ, అడవిలో భార్యను కష్టపెట్టలేనని చెప్పిన పతి మాటను గౌరవించి.. సాగనంపింది. లక్ష్మణుడు తిరిగొచ్చేదాక బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించాలని దీక్ష పూనుకని 14 ఏళ్లు నిద్రలోనే గడిపేసింది.

ఈ కాలంలోనూ అలాంటి దీక్షే చేపట్టింది మధ్యప్రదేశ్​ జబల్​పుర్​కు చెందిన ఊర్మిళా చతుర్వేది . అయితే.. ఈమె దీక్ష లక్ష్మణుడి కోసం కాదు అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణం కోసం.

హిందూ ముస్లిం కలవాలని

1992లో బాబ్రీ ఘటన వార్తలు వెలువడినప్పుడే.. ఆ చోట రామాలయం నిర్మించేవరకు తాను ఉపవాసం ఉంటానని సంకల్పించారు ఊర్మిళ. అయోధ్యలో రాముడికి గుడి కట్టినప్పుడు అక్కడికి వెళ్లి దీక్ష విరమించాలని నిర్ణయించుకున్నారు.

అయితే, అయోధ్య స్థలం కోసం విధ్వంసాలు సృష్టించడం ఊర్మిళకు ఇష్టం లేదు. రెండు వర్గాలు సామరస్యంగా ఆలోంచించాలని ఆమె కోరుకున్నారు. సోదరభావంతో మెలిగినప్పుడే రామమందిర నిర్మాణం సాధ్యమవుతుందని బలంగా నమ్మారు. అందుకోసం రోజూ నిష్ఠగా పూజలు చేసేవారు.

సుప్రీం తీర్పుతో మహానందం

ఎంఏ పీజీ పూర్తి చేసిన ఊర్మిళా.. సంస్కృత ఉపాధ్యాయురాలిగాను పనిచేశారు. 27 ఏళ్లు ఆమె కేవలం రోజుకో పండు, పానీయాలే తప్ప అన్నం ముట్టలేదు. ఈ నెల 9వ తేదీన అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం తీర్పు వెలువరించేసరికి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

"నా పదమూడేళ్ల కూతురు అంతర్జాలంలో చూసింది. రేపే సుప్రీం తీర్పు వెలువరించనుందని చెప్పింది. పరిగెత్తుకుంటూ వచ్చి.. 'నానమ్మ రేపటి నుంచి నువ్వు అన్నం తినాలి, నీ ఉపవాసాన్ని వదిలేయాలి'అని మా అత్తయ్యతో చెప్పింది. అప్పుడు అత్తయ్య చాలా తీపి వార్త చెప్పావంటూ సంబరపడిపోయింది. దేవుడి ముందు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసింది. "

-రేఖా చతుర్వేది, ఊర్మిళ కోడలు

అంత చదువుకుని ఇలా రాముడి గుడికోసం ఉపవాసం ఉండడం ఏమిటని ఎందరో ఎగతాలి చేశారు.. ఆమె వ్రతాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె ఎవ్వరినీ పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆమె మొక్కులు ఫలించాయి. త్వరలో అయోధ్య చేరుకుని రామ మందిరంలో ఆమె దీక్ష విరమించనున్నారు.

ఇదీ చూడండి:సకల వర్గాల నగరి.. 'అయోధ్యపురి'

Last Updated : Nov 11, 2019, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details