తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..! - howrah hospitals

కన్నతండ్రిని కడసారి చూసుకోవడానికి ఖరీదు కట్టారు బంగాల్​లోని ఓ ఆసుపత్రి సిబ్బంది. రూ.51 వేలు చెల్లిస్తేనే నాన్న ముఖం చూపిస్తామన్నారు. దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లిన తనయుడిపై కాస్తైన కనికరించలేదు. చివరికి ఏం చేశారో మీరే చదవండి.

a-hospital-demanded-son-rs-51000-slash-to-see-fathers-face-for-the-last-time-in-howrah
తండ్రి ఆఖరి చూపు ఖరీదు రూ. 51,000/-..!

By

Published : Aug 11, 2020, 10:39 AM IST

Updated : Aug 11, 2020, 11:22 AM IST

బంగాల్, హౌరాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కరోనా బారినపడి మృతి చెందిన తండ్రి ముఖం చూసేందుకు తనయుడు రూ.51 వేలు చెల్లించాలన్నారు ఓ ఆసుపత్రి సిబ్బంది. అంతే కాదు, తండ్రి చనిపోయిన 12 గంటల వరకు ఆ వార్త తనయుడికి చెప్పలేదు.

హౌరా, సల్కియాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతూ ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు పరీక్ష చేయగా కరోనా సోకినట్లు నిర్ధరణయింది. ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఆ సంగతి ఆసుపత్రి సిబ్బంది వెల్లడించలేదు. దాదాపు 12 గంటలపాటు కుటుంబసభ్యులంతా ఆయనకు చికిత్స చేస్తున్నారనే భావించారు. ఆ తర్వాత విషయం తనయుడికి చెప్పారు. గుండెలు పగిలేలా ఏడుస్తూ... ఒకే ఒక్కసారి నాన్న ముఖం చూపించమని వేడుకున్నాడు.

మృతి చెందిన తండ్రి ముఖం చూడాలంటే రూ.51 వేలు చెల్లించాలన్నారు సిబ్బంది. అలా చెల్లిస్తే, ఆరోగ్యశాఖ వెల్లడించిన నిబంధనల ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామన్నారు. అంత స్థోమత లేదని మొరపెట్టుకున్నా వినలేదు. ఆఖరికి బేరమాడి రూ.2500 చెల్లించి తండ్రి ఆఖరి చూపుకు నోచుకున్నాడు ఆ కుమారుడు.

ఇదీ చదవండి: సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం

Last Updated : Aug 11, 2020, 11:22 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details