తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో రక్తతర్పణం.. నరబలికి విఫలయత్నం - రక్తతర్పణం

అసోం ఉలిక్కిపడింది. మారుమూల ప్రాంతంలో.. అతి క్రూరంగా.. ఆటవికంగా జరిగిన నరబలి యత్నం.. రాష్ట్ర ప్రజలనే కాదు.. దేశాన్నీ భయపెట్టింది. క్షుద్రమాయలో పడిన ఓ కుటుంబం.. అల్లారుముద్దుగా పెరిగిన తమ ఇంటి పసిప్రాణాన్నే బలి ఇచ్చేందుకు సిద్ధపడింది. రక్తాభిషేకానికి సర్వం సిద్ధం చేసింది. ఆ బాలుడి పరిస్థితి ఏమైంది?

అసోంలో రక్తతర్పణం.. నరబలికి విఫలయత్నం

By

Published : Jul 6, 2019, 11:05 PM IST

Updated : Jul 7, 2019, 7:08 AM IST

అసోంలో రక్తతర్పణం.. నరబలికి విఫలయత్నం
ఈశాన్య రాష్ట్రం అసోంలో భయంకర ఘటన జరిగింది. ఉదాల్​గుడి జిల్లాలో ఓ కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనలో.... క్షుద్ర పూజల కోసం అభంశుభం తెలియని చిన్నారిని నరబలి అర్పించేందుకు సిద్ధపడింది ఓ క్రూర కుటుంబం. ఆ బాలుడు వేరెవరో కాదు... నరబలికి యత్నించిన వారి కుటుంబంలోని పంచ ప్రాణమే.

కుమార్తె మృతితో భయాందోళనలకు లోనైన జాదవ్ సహారియా కుటుంబం... ఓ క్షుద్ర పూజారి మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ పూజల ద్వారా కొన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేరుతాయని, కుటుంబం క్షేమంగా ఉంటుందన్న భావనతో ఘోరకలికి సిద్ధపడింది. విషయం బయటికి రాగా... స్థానికులు ఈ దురాఘతాన్ని ఆపేందుకు యత్నించారు. వారిపై జాదవ్ కుటంబీకులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులు, సీఆర్​పీఎఫ్ బలగాలకు సమాచారమిచ్చారు. రాళ్లతో ఎదురుదాడికి దిగిన కుటుంబాన్ని కట్టడి చేసేందుకు భద్రతాసిబ్బంది కాల్పులు చేయాల్సి వచ్చింది. తీవ్ర ప్రయత్నం అనంతరం ఈ క్రూర కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న బలగాలు పోలీస్ స్టేషన్​కు తరలించాయి.

అందరూ విద్యావంతులే...!

ఈ క్షుద్ర పూజలకు పూనుకున్న కుటుంబంలో యజమాని సహారియా సహా అందరూ ఉన్నత విద్యావంతులే. జాదవ్ సహారియా సైన్స్ టీచర్ కాగా, అతడి కుమారుడు ఎంబీఏ చదివాడు. సహారియా భార్య నర్స్​గా పనిచేస్తోంది. ఇలాంటి విద్యావంతులున్న ఇంట.. ఇంతటి క్రూరమైన ఘటన జరుగుతుందని ఊహించలేదని స్థానికులు భయం భయంగా చెప్పారు.

ఇదీ చూడండి: కొన ఊపిరితో ఉండగానే తగలబెట్టారు..

Last Updated : Jul 7, 2019, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details