తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షెట్టి గారింట్లో చూడముచ్చటైన అతిథి ఈ 'హార్న్​బిల్​' - హార్న్​బిల్​ అనుబంధం

అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు.. మనుషులకే కాదు. జంతువులు, పక్షుల మధ్య కూడా ఉంటాయి. అందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది "హార్న్‌బిల్‌" అనే ఓ అరుదైన పక్షి. కర్ణాటక కార్వార్​ జిల్లాలోని కృష్ణానంద షెట్టి కుటుంబంలో ఒకరిగా కలిసి మెదులుతోంది. గ్రామంలో ఎన్నో ఇళ్లు ఉన్నప్పటికీ ఆ పక్షి మాత్రం షెట్టి ఇంటికే విచ్చేస్తుంది. సరదాగా వారితో గడుపుతోంది.

a hornbill bird made beautiful relationship with shetty family in karnataka
షెట్టి గారింట్లో చూడ ముచ్చటైన అతిథి ఈ 'హార్న్​బిల్​'

By

Published : Nov 1, 2020, 8:45 AM IST

షెట్టి గారింట్లో చూడ ముచ్చటైన అతిథి ఈ 'హార్న్​బిల్​'

కర్ణాటక కార్వార్ జిల్లాలోని హొన్నకెరి గ్రామంలోని కృష్ణానంద షెట్టి కుటుంబంతో అనుబంధాన్ని పెనవేసుకుంది "హార్న్‌బిల్‌" అనే ఓ అరుదైన పక్షి. 6 నెలలుగా వారిలో ఒకరిగా కలిసిపోతోంది.

ఈ పక్షి ప్రత్యేకతలివే..

"హార్న్‌బిల్‌" చాలా అద్భుతమైన, విలక్షణమైన పక్షి. వర్షారణ్యాల్లో ఉండే ఈ పక్షి.. అందమైన రెక్కలతో, ఆకాశంలో విహరిస్తుంటే భలేగా కనిపిస్తుంది. మెడ, తోక.. తెలుపు, ముఖం, రెక్కలు.. నలుపు రంగులో ఉంటాయి. రెక్కలపై ఉండే తెలుపు చారలు ఎగిరేటప్పుడు మెరుస్తాయి. భారత్‌లో ఈ హార్న్‌బిల్‌ పక్షులు చాలా అరుదు. ఉన్న వాటిల్లో ఎక్కువగా పశ్చిమ కనుమల్లోనే కనిపిస్తాయి. అలాంటి పక్షి షెట్టి కుటుంబంతో కలిసిపోతోందంటే.. ఆశ్చర్యం కలగకపోదు.

"ఈ హార్న్‌బిల్‌ పక్షి 6నెలలుగా మా ఇంటికి వస్తోంది. నా స్నేహితుడు.. దాని రాక గుర్తించి, ఇక్కడకు వస్తున్నట్లు చెప్పాడు. ఒకసారి కొంచెం ఆహారం పెట్టాను. అప్పటి నుంచి రోజూ వస్తోంది. ఇప్పుడు మా కుటుంబంలో కలిసిపోయింది."

--కృష్ణానంద షెట్టి, ఇంటి యజమాని

అలా కలిసిపోయింది..

కృష్ణానంద షెట్టి కుటుంబ సభ్యులు.. ప్రేమతో చిరుధాన్యాలు, స్వీట్లు, అన్నివిధాల ఆహారం ఈ హార్న్​బిల్​కు పెడుతుంటారు. రోజుకు 3 సార్లు ఒకే సమయానికి వచ్చి వెళ్తుంటుంది. ఇంట్లోని పిల్లలూ అరటి పండ్లు, చపాతీ, స్వీట్లు తినిపిస్తుంటారు.

"ఆ పక్షి మా ఇంటికి రావడాన్ని అదృష్టంగా భావిస్తుంటాం. మొదట్లో మేం పెట్టిన ఆహారం తినేది కాదు. కొన్నిరోజులకు దానికోసం బయట ఉంచే జొన్నలు తినేది. అలా మాతో కలిసి పోవటం మొదలు పెట్టింది. హార్న్‌బిల్‌ పక్షి మా ఇంట్లో సభ్యురాలు అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు."

--మాయా షెట్టి, కృష్ణానంద షెట్టి సతీమణి.

వాళ్ల ఇంటికే..

షెట్టి ఇంట్లో హార్న్‌బిల్‌ పక్షి సందడి ఎవరికి నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకంటే హొన్నకెరి గ్రామంలో ఎన్నో ఇళ్లు ఉన్నప్పటికీ నేరుగా ఆ ఇంటికే వచ్చి వాలుతుంది, వాళ్లు పెట్టేదే తింటుంది. మొదట్లో పెట్టింది తిని వెళిపోతుండేది. క్రమంగా కొద్దిసేపు అక్కడే ఉండి పిల్లలు, వారి బంధువులతోనూ సరదాగా గడపడం మొదలు పెట్టింది.

"ఉదయం 6.30గంటలకు వస్తుంది. తర్వాత తరచూ వచ్చి పోతుంటుంది. ఆహారం, పండ్లు పెడుతాం, ఆడుకుంటుంటాం. మాకు అదంటే ఎంతో ఇష్టం. మనుషుల్లానే అది మమ్మల్ని ఇష్టపడుతుంటుంది. ఆ పక్షితో ఉండడం మాకెంతో ఆనందం అనిపిస్తుంది."

--అక్షయ్‌ షెట్టి, కృష్ణానంద షెట్టి కుమారుడు.

ప్రారంభంలో షెట్టి కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వారిని చూస్తే భయపడేది ఆ పక్షి. ఇప్పుడు అందరితో బాగానే ఉంటోంది. పిల్లలు, కుటుంబ సభ్యులతో దాగుడుమూతలు ఆడుతోంది.

ఇదీ చూడండి:ఆ బాలిక సంకల్పానికి బ్రిటన్​ విశిష్ట పురస్కారం

ABOUT THE AUTHOR

...view details