తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ భూతంపై పోరు.. నీళ్ల సీసాలతో కలల సౌధం

ప్రపంచ పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్థాలు అనేక రకాలుగా ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర అమరావతి నివాసి నితిన్ ఉజ్​గావకర్​ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ప్లాస్టిక్​ సీసాలతో ఇంటిని నిర్మించి ఆదర్శంగా నిలిచాడు.

A home was constructed using plastic bottles
A home was constructed using plastic bottles

By

Published : Dec 22, 2019, 7:31 AM IST

నీళ్ల సీసాలతో కలల సౌధం

సాధారణంగా మనం ఇటుక, ఇసుక, సిమెంట్​తో ఇంటిని నిర్మించుకుంటాం. దేశాన్ని ప్లాస్టిక్​ రహితంగా మార్చేందుకు తనదైన పరిష్కారాన్ని చూపిస్తూ ప్లాస్టిక్​ సీసాలతో తన కలల ఇంటిని నిర్మించుకున్నాడు నితిన్ ఉజ్​గావకర్​​. ఇందుకోసం సుమారు 20వేల ప్లాస్టిక్​ సీసాలను ఉపయోగించాడు.

మహారాష్ట్ర అమవరాతిలోని 'సంత్​ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం' సమీపంలోని దస్తూర్​నగర్​లో ఈ ఇల్లు ఉంది. వాడిపడేసిన సీసాల​తో నిర్మాణాలు చేపడితే ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాస్టిక్​ సంక్షోభానికి పరిష్కారం దొరికినట్లేనని అంటున్నాడు నితిన్. ఖర్చు కూడా 30 నుంచి 40 శాతం తగ్గుతుందని చెబుతున్నాడు.

"ఒకసారి రోడ్డుపై వెళుతున్నప్పుడు 20,30 ప్లాస్టిక్​ సీసాలను చూశాను. వీటిని ఎలా రీసైకిల్ చేయాలని ఆలోచించాను. ఇందుకోసం ఇంటర్నెట్​లో వెతికితే చాలా ఉపాయాలు దొరికాయి. ఇల్లు నిర్మించటం మంచి ఆలోచనగా అనిపించింది.

ఈ విషయం ఇంట్లో వారికి, కార్మికులకు చెప్పినప్పుడు వాళ్లు ఆశ్చర్యపోయారు. పిచ్చి పట్టిందా అని అడిగారు. ప్లాస్టిక్​తో నిర్మించగలనని నామీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గోడలను నిర్మించారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాను."

-నితిన్​ ఉజ్​గావకర్​

ఇదీ చూడండి : ఆలోచన అదుర్స్​... ప్లాస్టిక్​ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ

ABOUT THE AUTHOR

...view details