జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రామ్‌బాగ్‌లో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రాత సిబ్బంది ఈ ఉదయం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. తేరుకొని భద్రతాబలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.
శ్రీనగర్‌లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - srinagar gun fight
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో ఒకరు లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడు కాగా మరొకరు పాకిస్థాన్ ఉగ్రవాదిగా గుర్తించారు.
ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు
చనిపోయిన ఇద్దరిలో ఒకరు పాకిస్థాన్ ఉగ్రవాది కాగా మరొకరు స్థానిక లష్కరే తోయిబాకు చెందిన ముష్కరుడిగా అధికారులు గుర్తించారు. ఇటీవల నౌగామ్‌లో సీఆర్పీఎఫ్ దళాలపై జరిగిన దాడిలో వీరి పాత్ర ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Oct 12, 2020, 12:32 PM IST