దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ మజీద్ కుట్టీని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. ఝార్ఘండ్‌లోని జంషెద్‌పుర్‌లో అతడ్ని అదుపులోకి తీసుకుంది. 1997లో గణతంత్ర దినోత్సవం రోజున గుజరాత్, మహారాష్ట్రలలో పేలుళ్లు జరపడానికి దావూద్ పన్నిన కుట్రలో మజీద్ పాలు పంచుకున్నాడు.
దావూద్ ఇబ్రహీం అనుచరుడి అరెస్ట్ - అబ్దుల్ మాజిద్ కుట్టి
దావూద్ ఇబ్రహీం అనుచరుడిని గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో అరెస్ట్ చేసింది. 1997లో గుజరాత్, మహారాష్ట్రల్లో పేలుళ్లు జరపడానికి దావూద్ చేసిన ప్రయత్నాల తర్వాత అతని అనుచరుడు పరారీలో ఉన్నాడు.
A Gujarat ATS team on Saturday arrested Dawood's aide Abdul Majeed Kutty from Jamshedpur, Jharkhand.
24 ఏళ్లుగా పరారీలో ఉన్న మజీద్.. ఝార్ఘండ్‌లో కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నివసిస్తున్నాడని అధికార వర్గాల సమాచారం. పేలుళ్లకు సంబంధించి 106 తుపాకీలు, 750 క్యాట్రిడ్జ్ల, 4 కేజీల మందుగుండు అమ్మిన కేసులో మజీద్ నిందితుడు. ముంబయి పేలుళ్ల కేసులోనూ ఇతను నిందితుడుగా ఉన్నాడు.
ఇదీ చదవండి:'ఎల్ఓసీ వెంబడి అలజడులకు పాక్ కుట్ర!'