తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టు వీడని 'సేన'... ఆదిత్య ఠాక్రే సీఎంగా ఫ్లెక్సీ​ ప్రత్యక్షం! - మహారాష్ట్ర తాజా వార్తలు

మహారాష్ట్రలో అధికారం చెరిసగం అంటూ పట్టిన పట్టును శివసేన వీడటం లేదు. శివసేన ప్రతిపాదన కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కమలనాథులకు వేరే మార్గం కనిపించట్లేదు. ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి ఇవ్వాలని ఇప్పటికే సేన కోరింది. ఈ తరుణంలో ఠాక్రే నివాసం ఎదుట 'సీఎం ఆదిత్య ఠాక్రే' అంటూ ఓ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది.

ఆదిత్య సీఎంగా ఫ్లెక్సీ ప్రత్యక్షం

By

Published : Oct 26, 2019, 4:48 PM IST

Updated : Oct 26, 2019, 4:59 PM IST

'భాజపా, శివసేనకు చెరో రెండున్నరేళ్లు అధికారం.. ఆదిత్య ఠాక్రేకు సీఎం పదవి..' ఇది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన మాట. సీట్ల పరంగా అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించినప్పటికీ... ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే శివసేన మద్దతు తప్పనిసరి. ఇలాంటి తరుణంలో భాజపా ఎటూ తేల్చుకోని సందిగ్ధ స్థితిలో ఉంది.

ఇలాంటి సమయంలో సాక్షాత్తు ఠాక్రే నివాసం ఎదుట ఓ ఫ్లెక్సీ ప్రత్యక్షమైంది. 'ఆదిత్య ఠాక్రే... మహారాష్ట్ర సీఎం' అంటూ ఫ్లెక్సీపై రాసి ఉంది. అయితే ఠాక్రేల నివాసమైన మాతోశ్రీ ముందు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సేన డిమాండ్​కు బలం చేకూర్చుతోంది.

ఠాక్రే నివాసం(మాతోశ్రీ) ఎదుట ఫ్లెక్సీ

288 స్థానాలున్న మరాఠా అసెంబ్లీలో భాజపా 105 స్థానాలు సాధించింది. శివసేన 56 స్థానాల్లో జెండా ఎగరేసింది. ఈ నేపథ్యంలో మెజారిటీ కోసం ఇరు పార్టీలు కలిసి నడవక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇదీ చూడండి: ఆసక్తి : భాజపాపై శివసేన పరోక్ష విమర్శలు!

Last Updated : Oct 26, 2019, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details