కేరళ కొల్లమ్ జిల్లా పన్మానా గ్రామంలోని కుట్టివట్టమ్ కూడలిలో చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అబ్దుల్ రహీం అనే వ్యక్తి. ప్లాస్టిక్‌ను వాడకుండా చేపలను అందించాలనే ఆలోచన చేశాడు. భూమిలో త్వరగా కలిసిపోయేలా ఆకులతో బుట్టలు తయారు చేయాలనుకున్నాడు. ఆలోచన రావడమే తడవు.. కొబ్బరి ఆకులతో చిన్నపాటి బుట్టలను తయారు చేసి.. చేపలను అందులో పెట్టి అందిస్తున్నాడు. రోజుకు 60 బుట్టలు వినియోగిస్తున్నాడు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ బుట్టను తయారు చేస్తుండటం విశేషం.
ఆకుల బుట్టలతో ప్లాస్టిక్ నిషేధంపై వినూత్న ప్రయత్నం
పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ నిషేధంపై వినూత్న ప్రయత్నం చేశాడు కేరళకు చెందిన ఓ చేపల విక్రయదారు. కొబ్బరి ఆకులతో చేసిన బుట్టల్లో చేపలను అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం ప్లాస్టిక్‌ను విరివిగా వినియోగిస్తున్న ప్రజలు.. క్రమక్రమంగా చేతితో చేసిన బుట్టలకు అలవాటు పడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఆకుల బుట్టలతో ప్లాస్టిక్ నిషేధంపై వినూత్న ప్రయత్నం
పర్యావరణ హిత బుట్టలను అందిస్తున్నప్పటీ.. ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నాడు రహీం. అయితే.. క్రమ క్రమంగా చేతితో చేసిన బుట్టలకు అలవాటు పడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అత్యంత ప్రమాదకర ప్లాస్టిక్‌ను నిషేధించాలనే రహీం ప్రయత్నం ఆదర్శప్రాయమని.. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు పంచాయతీ ఉపాధ్యక్షుడు అనిల్ పుతేజామ్.