తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దిల్లీలోని సెయిల్​ కంపెనీలో ఐదుగురికి కరోనా' - దిల్లీలోని సెయిల్​ కంపెనీలో అయిదుగురికి కరోనా

దేశ రాజధాని దిల్లీలోని స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఐదుగురికి కొవిడ్​-19 సోకింది. ఈ నేపథ్యంలో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.

A few SAIL employees test positive for COVID-19
దిల్లీలోని సెయిల్​ కంపెనీలో అయిదుగురికి కరోనా

By

Published : Jun 3, 2020, 5:27 PM IST

దేశంలో వైరస్​ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దిల్లీలోని స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​(సెయిల్​)లో ఐదుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి కార్యాలయ విభాగంలో వైరస్​ కేసులు నమోదవడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వైరస్​పై మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సలహాలను తప్పనిసరిగా పాటించాలని ఉద్యోగులందరికీ వీడియో సందేశం పంపారు సెయిల్​ ఛైర్మన్​ ఏకే చౌదరి. కార్యాలయాన్ని రెండురోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇంటి నుంచే పని చేయాలని ఉద్యోగులకు సూచించారు.

దశల వారీగా కార్యలయ పనులు పునః ప్రారంభమవుతాయని చెప్పిన సంస్థ​... శానిటైజేషన్​, థర్మల్​ స్క్రీనింగ్​ వంటి అవసరమైన భద్రతా చర్యలను కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు మ్యాక్స్​, అపోలో వంటి ప్రైవేట్​ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:'ఇండియా పేరు మార్పుపై ఆదేశాలివ్వలేం'

ABOUT THE AUTHOR

...view details