మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల ప్రచారాలు ముమ్మరం చేశాయి పార్టీలు. ఈ క్రమంలోనే నేడు బుల్దానా జిల్లాలోని నందుర్, ఖామ్గావూన్, సంగ్రమ్ పాల్ తాలుకాల్లో ప్రచారం చేపట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఇదే సమయంలో జిల్లాలోని శేగావూన్ తాలూకాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు భాజపా గుర్తు ఉన్న చొక్కా వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కార్మిక శాఖ మంత్రి డా.సంజయ్ కుట్టే నియోజకవర్గం జల్గావూన్లోని ఖాత్ఖేడ్ గ్రామంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన రైతు రాజు గ్యానదేవ్ తల్వార్ (35)గా గుర్తించారు.