తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి.. - dry banana in india

లాక్​డౌన్​ వేళ ఓ రైతు అద్భుతమే సృష్టించాడు. కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.

A farmer made natural dry banana fruit during lockdown
లాక్​డౌన్​ వేళ.. అరటిపండ్లను ఎండబెట్టాడు.. లాభాలు పొందాడు!

By

Published : Jun 23, 2020, 7:56 AM IST

డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్షా.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు.

కష్టం నుంచి ఆలోచన!

లాక్​డౌన్​ వేళ.. అరటిపండ్లను ఎండబెట్టాడు.. లాభాలు పొందాడు!

బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన కే. గంగాధర్​ ఓ సాధారణ రైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​. కానీ, మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు.

లాక్​డౌన్​ వేళ.. అరటిపండ్లను ఎండబెట్టాడు.. లాభాలు పొందాడు!

విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్. భారత్​లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేస్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.

లాక్​డౌన్​ వేళ.. అరటిపండ్లను ఎండబెట్టాడు.. లాభాలు పొందాడు!

ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని.. ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే... ఈ డ్రై బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్​.

లాక్​డౌన్​ వేళ.. అరటిపండ్లను ఎండబెట్టాడు.. లాభాలు పొందాడు!
లాక్​డౌన్​ వేళ.. అరటిపండ్లను ఎండబెట్టాడు.. లాభాలు పొందాడు!

ఇదీ చదవండి:భారతీయ రాగానికి నమస్కరించిన ప్రపంచం!

ABOUT THE AUTHOR

...view details