కర్ణాటక మైసూర్ జిల్లాలోని హళ్లారి గ్రామంలో కుల వివక్షకు అద్దంపట్టే ఘటన జరిగింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి క్షురకర్మ చేస్తున్నాడని ఓ సెలూన్ షాపు యజమానికి రూ.50వేలు జరిమానా విధించారు గ్రామ పెద్దలు. అంతేకాకుండా అతని కుటుంబాన్ని సామాజికంగా వెలివేశారు.
వారికి క్షవరం చేశాడని రూ.50 వేలు జరిమానా!
కర్ణాటక మైసూరు జిల్లాలో ఓ క్షురకుడికి రూ.50వేలు జరిమానా విధించారు గ్రామపెద్దలు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి క్షవరం చేశాడని అతడి కుటుంబాన్ని సామాజికంగా వెలివేశారు. ఇలా జరగడం మూడోసారి అని, అధికారులు చర్యలు తీసుకోకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని సెలూన్ షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎస్సీ, ఎస్టీలకు క్షౌరం చేశాడని రూ.50వేలు జారిమానా
ఇలా జరగడం మూడోసారి అని సెలూన్ షాపు యజమాని మల్లిఖార్జున్ శెట్టి తెలిపాడు. గతంలోనూ రెండు సార్లు జరిమానా చెల్లించినట్లు చెప్పాడు. ఎస్సీ, ఎస్టీలకు క్షవరం చేసినందుకు చన్నా నాయక్, ఇతరులు కలిసి తనను వేధిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సమస్యను పరిష్కరించకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని మల్లిఖార్జున్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి: 6 కి.మీ ఫాలో అయ్యారు- రూ.6 లక్షల వాచ్ కొట్టేశారు!