తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం మత్తులో... పామునే కాటేశాడు! - పామును చంపిన వ్యక్తి

మద్యం మత్తులో ఓ వ్యక్తి పామును కొరికి చంపిన ఘటన కర్ణాటక కోలారు జిల్లా మళబాగిలో జరిగింది. మద్యం తాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో పాము అడ్డుపడింది. ఈ నేపథ్యంలో 'నాకే ఎదురొస్తావా' అంటూ సర్పాన్ని కొరికి చంపాడు.

A drunkard bites snake and killed ; photo and video goes viral
మద్యం మత్తులో...పామునే కాటేశాడు

By

Published : May 6, 2020, 7:07 PM IST

కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పామునే కొరికి చంపాడు. సోమవారం మద్యం విక్రయాలు ప్రారంభంకాగానే ఓ వ్యక్తి పీకలదాకా తాగాడు. ఆ మత్తులోనే తన మోటార్‌ సైకిల్‌ను నడుపుకొంటూ వెళ్తుండగా ఓ పాము అడ్డం వచ్చింది.

నాకే అడ్డు వస్తావా? అంటూ మోటార్‌ సైకిల్​ను ఆపి పామును పట్టుకుని అక్కడికక్కడే దాని తల భాగాన్ని కొరికి చంపాడు. ఆ తరువాత దాన్ని మెడలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసినందున సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details