తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2020, 2:45 PM IST

ETV Bharat / bharat

మనిషిని క్రేన్​కు వేలాడదీసి 2కి.మీ ఊరేగింపు

ఓ వైపు సాంకేతికత, అభివృద్ధి అంటూ ప్రపంచం పరుగులు పెడుతుంటే.. మరోవైపు ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కర్ణాటక బళ్లారిలో ఓ వింత ఆచారం అక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పులా మారింది. ఇంతకీ ఆ ఆచారం ఏమిటో చూద్దాం.

a-different-type-of-divine-is-celebrated-in-this-village-you-will-get-shock-to-know-about-this
ప్రాణాలకు ముప్పు తెచ్చే వింత ఆచారం.. అదెక్కడంటే..?

చేతికి చిన్న గాయం అయితేనే నొప్పితో విలవిల్లాడిపోతాం. అలాంటిది శరీరానికి ఏకంగా ఇనుప కడ్డీని గుచ్చి ఓ క్రేనుకు వేలాడదీస్తూ కిలోమీటర్ల మేర ఊరేగిస్తున్నారు కర్ణాటక బళ్లారి జిల్లా కడ్డి రామ్​పురా గ్రామస్థులు. ఇదేంటని అడిగితే అది తమ ఆచారమని చెబుతున్నారు.

ప్రతి ఏడాది భద్రకాళి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా కొంతమంది గ్రామస్థుల వీపునకు ఇనుప కడ్డీలు గుచ్చి వారిని క్రేన్​కు వేలాడదీస్తారు. ఆ ఊరి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి దేవాలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అనంతరం వారు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న నిప్పుల గుండాన్ని దాటుతారు. ఇలా చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయని అక్కడి భక్తులు విశ్వాసం. కొంతమంది ఇదో రకమైన ఆచారమని చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం ఇది పూర్తిగా మూఢ నమ్మకమని అంటున్నారు.

ప్రాణాలకు ముప్పు తెచ్చే వింత ఆచారం.. అదెక్కడంటే..?

ఇదీ చదవండి:రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!

ABOUT THE AUTHOR

...view details