తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుట్టుకతో దివ్యాంగురాలు.. అయినా అందాల రాణే! - జైపూర్ అం​దాల పోటీలు

ఆమె ఓ అందమైన అతివ.. పలుమార్లు జాతీయ, అంతర్జాతీయ అందాల పోటీల్లోనూ సత్తాచాటిన భారత యువతి. అయితే తన విజయానికి అందం మాత్రమే కారణం కాదు​. పుట్టుకతోనే దివ్యాంగురాలైనా.. ఆమె ఆత్మ విశ్వాసం, ముఖంపై చెక్కు చెదరని చిరునవ్వు, ఓటమికి కుంగిపోని మనస్తత్వం ఇప్పుడు మరోసారి ఆమెను సకలాంగులతో పోటీపడి 'మిస్ జయపుర'​గా నిలిపాయి.

పుట్టుకతో దివ్యాంగురాలు.. అయినా అందాల రాణే!

By

Published : Oct 15, 2019, 5:32 AM IST

పుట్టుకతోనే దివ్యాంగురాలు.. అయినా అందాల రాణే!

ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది రాజస్థాన్​​కు చెందిన మినీ రాజ్​పాల్​. దివ్యాంగురాలైనా.. జయపుర​ అందాల పోటీల్లో విజేతగా నిలిచి అన్ని అవయవాలున్న వారికి స్ఫూర్తినిస్తోంది.

ఎదుటి వారు తన ముందే తనను కించపరుస్తున్నా మినీ పట్టించుకోదు ఎందుకంటే వారి వెక్కిరింపులు వినే శక్తి తనకు పుట్టుక నుంచే లేదు. ఒకవేళ అర్థమైనా, పన్నెత్తి ఓ మాట అనడానికి తనకు మాటలూ రావు. అయినా, ఏ రోజూ తను ఎదుటి వారికంటే తక్కువ అనుకోలేదు.

బాల్యంలో టీవీలో అందాల పోటీలు చూసి, మోడలింగ్​పై ఆసక్తి పెంచుకుంది మినీ. ఆమె సోదరి, దివ్యాంగుల ప్రగతి కోసం పని చేస్తున్న మనోజ్​ భరద్వాజ్​ల ప్రోత్సాహంతో ఇంటి నుంచి బయటికెళ్లి చిన్న చిన్న అందాల పోటీల్లో పాల్గొంది. చాలా సార్లు అపజయాలు కూడా ఎదురయ్యాయి. కానీ, ఓటమికి కుంగిపోలేదు. నిరంతరం ప్రయత్నించి విజయవంతమైంది.

కేవలం పట్టుదల, ఆత్మస్థైర్యంతో జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని భారత ఖ్యాతిని పెంచింది.

2012లో ముంబైలో 'మిస్​ డెఫ్​ ఇండియా' ద్వితీయ రన్నరప్​గా నిలిచింది మినీ. 2013లో సోఫియా బుల్గారాలో జరిగిన అంతర్జాతీయ మిస్​ డెఫ్​ పోటీల్లో భారత్​ నుంచి ప్రాతినిధ్యం వహించింది. అంతే కాదు, 2014లో జయపుర​లో సామాన్యులతో పోటీపడి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

"నేను బాల్యం నుంచే దివ్యాంగురాలిని. కానీ, చాలా కలలు కనేదాన్ని. టీవీ చూస్తున్నప్పుడు వారిలా​ డిజైనర్​ దుస్తులు ధరించి వేదికపై నడవాలనుకునేదాన్ని. కానీ, నేను దివ్యాంగురాలిని కావడం వల్ల, వారితో కలిసి నడవలేను అనుకున్నాను. తర్వాత, మా అక్క, మనోజ్​ నన్ను ప్రోత్సహించారు. ప్రభుత్వం మాకు ప్రోత్సాహం ఇస్తే, మా లాంటి వారు ఎన్నో విజయాలు సాధిస్తారు. కానీ అలాంటి పథకాలేవి పెట్టనందుకు బాధగా ఉంటుంది."
-మినీ రాజ్​పాల్​, మిస్​ జయపుర​

భారత వ్యవస్థ పట్ల మినీ నిరాశ వ్యక్తం చేస్తోంది. సాధారణ మోడల్స్​కు జాతీయ అవార్డు దక్కితేనే విస్తారంగా ప్రచారం చేస్తారు. కానీ, తమ లాంటి వారికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చినా పట్టించుకోరని వాపోతోంది.

ఇదీ చూడండి: విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు వద్దు: ఎన్​సీఈఆర్​టీ

ABOUT THE AUTHOR

...view details