మధ్యప్రదేశ్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగికి రూ.350 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన మరువకముందే మహారాష్ట్రలో ఓ రోజు కూలీకి ఐటీశాఖ షాకిచ్చింది. కల్యాణ్‌కు చెందిన బావుసాహెబ్ అహిరే అనే రోజు కూలీకి కోటి రూపాయలు పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీచేసింది.
ఐటీ షాక్: రోజు కూలీకి రూ.కోటి ఆదాయపు పన్ను - జాతీయ వార్తలు
మహారాష్ట్రలో ఓ రోజు కూలీకి ఐటీ శాఖ షాకిచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.కోటి పన్ను చెల్లించాలని నోటీసులు పంపింది. రోజు కూలీ అయిన తాను కోటి రూపాయలు ఎక్కడనుంచి తేగలనని లబోదిబోమంటున్నాడు అహిరే.
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,05,82,564 పన్ను చెల్లించాలని తాఖీదుల్లో పేర్కొంది. అహిరే బ్యాంకు ఖాతాలో రూ.21 లక్షలు, రూ.56,81,000 చొప్పున సహా మరికొంత మొత్తం జమైనట్లు నోటీసుల్లో పేర్కొంది.
మరోవైపు ఐటీ నోటీసులపై బావుసాహెబ్ అహిరే లబోదిబోమంటున్నాడు. రోజు కూలీయైన తనకు వారంలో రెండు రోజుల పనిదొరకడమే గగనమన్న అహిరే.. లక్ష రూపాయలు కూడా చూడలేదంటున్నాడు. ఇప్పుడు రూ.కోటి ఎక్కడనుంచి తేగలనని ప్రశ్నిస్తున్నాడు. నోటీసులపై దర్యాప్తు జరిపించాలని అధికారులను కోరుతున్నాడు.