దేశంలో వివిధ చోట్ల భిన్న వాతావరణం నెలకొన్నట్లు తెలిపింది భారత వాతావరణ శాఖ. ఒడిశా దక్షిణ తీర ప్రాంతంలో.. తుపాను సూచనలు కనిస్తున్నాయని హెచ్చరించింది. బిహార్, తూర్పు బంగాల్ కోస్తా ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తున రుతుపవనాలు వీస్తున్నట్లు తెలిపింది.
రాజస్థాన్లో వర్షాలు పూర్తిగా నిలిచిపోయాయని.. గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో నైరతీ రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని తెలిపింది. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు వెల్లడించింది.