తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆవు కోసం పులితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు - A COW AND A MAN DEAD DUE TO TIGER ATTACK IN UMARIA

ఆవు ప్రాణాన్ని కాపాడేందుకు పులినే ఎదిరించాడు ఆ యువకుడు. అయితే ఆ అటవీ జంతువును ఎదుర్కోలేక ఆవుతో సహా ప్రాణాలు వదిలాడు. మధ్యప్రదేశ్​లోని ఉమారియా జిల్లాలో జరిగిందీ ఘటన.

cow
ప్రాణంగా పెంచిన ఆవుకోసం పులితో పోరాటం!

By

Published : Jan 27, 2020, 12:52 PM IST

Updated : Feb 28, 2020, 3:18 AM IST

ఆవు కోసం పులితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

తన ఆవుకోసం పులితో పోరాడాడు ఆ యువకుడు. మాటున పొంచి ఉండి ఆవుపై పంజా విసిరిన పులిని వెళ్లగొట్టేందుకు ఎదురొడ్డి నిలిచాడు. అయితే ఆ అడవి జంతువును ఎదిరించలేక ఆవుతో సహా ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలోని మారుమూల గ్రామంలో జరిగిందీ సంఘటన.

ఇదీ ఘటన

నౌరోజాబాద్ పోలీస్​స్టేషన్ పరిధిలోని అక్మ​నిహా గ్రామ సమీపంలోని అడవిలోకి పశువులను తోలుకెళ్లాడు నరవాద్ అనే యువకుడు. పొదల్లో పొంచి ఉన్న పులి ఆకస్మాత్తుగా ఆవుపై దాడికి దిగింది. ఆవును రక్షించేందుకు పులిపై నరవాద్ ప్రతిదాడి చేశాడు. అయితే ఆవును వదలి నరవాద్​పై దాడికి మళ్లింది పులి. దానిని వెళ్లగొట్టలేనని గ్రహించిన అతడు పులి నుంచి పారిపోవడం ప్రారంభించాడు. అయితే నరవాద్​ను వెంటాడి ప్రాణం తీసింది ఆ పులి. అప్పటికే ఆవు కూడా మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. పోస్ట్​మార్టమ్​ కోసం ఆసుపత్రికి తరలించారు. అక్మనిహా గ్రామం బాంద్​వాగఢ్ జాతీయ పార్క్​కు సమీపంలో ఉన్న నేపథ్యంలో వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తాయని సమచారం.​

ఇదీ చూడండి: భారత్​లో కరోనా కలకలం.. పలు రాష్ట్రాల్లో అనుమానిత కేసులు​

Last Updated : Feb 28, 2020, 3:18 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details