తెలంగాణ

telangana

ప్రపంచవ్యాప్తంగా 20 వేలు దాటిన కరోనా మరణాలు

By

Published : Mar 25, 2020, 6:18 AM IST

Updated : Mar 25, 2020, 11:36 PM IST

A COVID19 positive
తమిళనాడులో తొలి కరోనా మరణం!

23:27 March 25

దేశవ్యాప్తంగా టోల్​ వసూలు తాత్కాలికంగా నిలిపివేత...

ప్రస్తుత లాక్​డౌన్​ పరిస్థితుల దృష్ట్యా.. దేశవ్యాప్తంగా టోల్​ప్లాజాల వద్ద టోల్​ వసూలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. అత్యవసర సేవలందించే విభాగాల వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు కేంద్ర రోడ్డు, రవాాణా మంత్రి నితిన్​ గడ్కరీ.

23:17 March 25

ఇటలీలో మరో 683 మంది...

ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి మరణించిన వారి సంఖ్య 20 వేలు దాటింది. ఇటలీలో 24 గంటల వ్యవధిలో 683 మంది మృతి చెందారు. అక్కడ మొత్తం మరణాల సంఖ్య 7,503కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంఖ్య 20 వేల 500గా ఉంది. 

23:06 March 25

పోలీసుల పనిష్​మెంట్​..

లాక్​డౌన్​ సమయంలో బయటకు వచ్చిన వ్యక్తులకు పోలీసులు చిత్రవిచిత్రాలుగా పనిష్​మెంట్​ ఇస్తున్నారు. కొందరిని గుంజీలు తీయిస్తుండగా, మరికొందరని మోకాళ్లపై కూర్చోబెట్టారు. కదిలితే లాఠీలతో శిక్షిస్తున్నారు. 

23:05 March 25

అక్కడ మరో ముగ్గురికి..

తమిళనాడులో మరో ముగ్గురికి కరోనా సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 26కు చేరింది. 

22:55 March 25

ఉల్లం'ఘనుల' కోసం డ్రోన్​లు..

కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూ నేపథ్యంలో.. ప్రజల కదలికలను పరిశీలించడానికి మహారాష్ట్రలోని ముంబయి పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 

22:54 March 25

రాజస్థాన్​లో 38 మందికి వైరస్​..

మరో ఇద్దరికి కరోనా సోకగా.. రాజస్థాన్​లో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. 

22:48 March 25

స్పెయిన్​ ఉపప్రధాని కార్మన్​ కాల్వో

స్పెయిన్​ ఉపప్రధానికి కూడా..

కరోనా తీవ్రంగా ఉన్న స్పెయిన్​లో ఆ దేశ ఉపప్రధాని కార్మన్​ కాల్వోకు కరోనా వైరస్​ పాజిటివ్​గా తేలింది. స్పెయిన్​ ప్రభుత్వం వెల్లడించినట్లుగా రాయిటర్స్​ ఉటంకించింది. 

22:45 March 25

విదేశాల నుంచి భారత్​కు...

గుజరాత్​లో చనిపోయిన మహిళ.. ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న ఆసుపత్రిలో చేరిన ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు పేర్కొన్నారు అహ్మదాబాద్​ ఆసుపత్రి వైద్యులు. గుజరాత్​ వైద్యారోగ్య శాఖ కూడా ఈమె మరణాన్ని ధ్రువీకరించింది. గుజరాత్​లో ఇది రెండో కరోనా మరణం. మార్చి 22న సూరత్​లో 67 ఏళ్ల వ్యక్తి వైరస్​ సోకి మరణించారు. 

22:28 March 25

గుజరాత్​లో మరొకరు మృతి...

కరోనా వైరస్​తో దేశంలో మరొకరు మరణించారు. గుజరాత్​లో 85 ఏళ్ల ఓ వృద్ధురాలు కొవిడ్​-19 వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయింది. 

21:37 March 25

పుతిన్​తో మాట్లాడిన మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ఫోన్​లో సంభాషించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్​-19 విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 

20:07 March 25

డాక్టర్ల కోసం అన్వేషణ...

కరోనాపై పోరుకు కేంద్రం మరింత సన్నద్ధమవుతోంది. రోగులకు చికిత్స అందించడానికి డాక్టర్లను అన్వేషిస్తోంది. వాలంటీర్లనూ తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

19:42 March 25

కేరళలో మరో 9...

కేరళలో తాజాగా మరో 9కేసులు నమోదయ్యాయి. దీనితో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 112కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 12మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు.

19:09 March 25

'దేశంలో 553 యాక్టివ్​ కరోనా కేసులు, 10 మంది మృతి'

దేశంలో కరోనా వైరస్​ కేసుల సంఖ్యపై తాజాగా వివరణ ఇచ్చింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 553 యాక్టివ్​ కేసులు నమోదైనట్లు తెలిపింది. మరో 42 మంది పూర్తిగా కోలుకోగా, 10 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. మొత్తం 606 మంది కరోనాబారిన పడ్డారని గణాంకాలు వెల్లడించింది.

ఇప్పటివరకు విమానాశ్రయాల్లో 15,24,266 మందికి స్ర్కీనింగ్​ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

18:57 March 25

కర్ణాటకలో 24 గంటల్లోనే మరో పది కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 51కి చేరింది. వీరిలో ముగ్గురు పూర్తిగా కోలుకోగా ఒకరు మృతి చెందారు.

17:44 March 25

మధ్యప్రదేశ్​లో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ మహమ్మారి బారినపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

17:39 March 25

  • ఏప్రిల్ 14 వరకు రిజర్వేషన్లు నిషేధించిన రైల్వే బోర్డు
  • ఆన్‌లైన్, కౌంటర్లలో రిజర్వేషన్లు నిషేధించిన రైల్వే బోర్డు
  • కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రిజర్వేషన్లను నిషేధించిన రైల్వే
  • ఏప్రిల్ 12 తర్వాత తదుపరి నిర్ణయం వెలువరించనున్న రైల్వే అధికారులు

17:33 March 25

మహాభారత యుద్ధం 18, కరోనా 21

కరోనాపై పోరులో వారణాసి.. యావత్​ దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని కోరారు.

తన సొంత నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు మోదీ. గడ్డు కాలంలో సొంత నియోజకవర్గంలో ఉండాలని.. కానీ దిల్లీలో పరిస్థితుల దృష్ట్యా కుదరలేదని వివరించారు. ఎంత తీరిక లేకుండా ఉన్నా.. వారణాసిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు.

మహాభారత యుద్ధం 18 రోజుల పాటు సాగిందని.. కరోనా మహమ్మారిపై పోరు 21 రోజులు పడుతుందని మోదీ పేర్కొన్నారు. వాట్సాప్​లో హెల్ప్​డెస్క్​ ఏర్పాటు చేసినట్టు మోదీ వారణాసి ప్రజలకు తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా.. 9013151515 నంబర్​కు వాట్సాప్​ చేయాలన్నారు.

17:17 March 25

  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మీడియా సమావేశం
  • వారణాసి ప్రజలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
  • వారణాసి ప్రజలు దేశానికి స్ఫూర్తిగా నిలవాలి: ప్రధాని
  • మనం కరోనాపై యుద్ధం చేస్తున్నాం: ప్రధాని మోదీ
  • కరోనాపై 21 రోజుల్లో విజయం సాధిద్దాం: ప్రధాని మోదీ
  • దేనికైనా మనస్సు ఉంటే మార్గం ఉంటుంది: ప్రధాని మోదీ
  • భారతీయులంతా ఇళ్లలోనే ఉండి కరోనాపై పోరాటం చేయాలి: ప్రధాని
  • ప్రజల ఆలోచనలను సరైన రీతిలో ఉపయోగించాలి: ప్రధాని
  • ఐకమత్యంగా ఉండి కరోనాను ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
  • కరోనాను ఓడించాలంటే ఇళ్లకు పరిమితమైతే చాలు: ప్రధాని
  • సంక్షోభంలో ఉన్న ప్రజలను కాశీయే నడిపించగలదు: ప్రధాని
  • దేశానికి సహనం, కరుణ, శాంతిని కాశీయే నేర్చించగలదు: ప్రధాని
  • కరోనా ఎంత ప్రమాదకరమైందో ప్రజలు అర్థం చేసుకోవాలి: ప్రధాని
  • ప్రజలు బాగా వింటారు, చూస్తారు, ఆలోచిస్తారు.. కానీ అమలు చేయాలి: ప్రధాని
  • మిమ్మల్ని, మీవాళ్లను కాపాడుకోవాలంటే సామాజిక దూరమే మార్గం: ప్రధాని

17:10 March 25

కశ్మీర్​లో మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. ఫలితంగా కశ్మీర్​ వ్యాప్తంగా ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 11కు చేరింది.

17:02 March 25

ఒడిశాలో వైద్య సిబ్బందికి ముందస్తుగా 4 నెలల జీతం ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

16:47 March 25

బలపరీక్షకు హాజరైన పాత్రికేయుడికి కరోనా

రాజకీయ సంక్షోభం ముగిసిందనుకుంటున్న మధ్యప్రదేశ్​లో మరోమారు కలకరం చెలరేగింది. ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన శివరాజ్​సింగ్ చౌహాన్​ బలపరీక్షకు హాజరైన ఓ పాత్రికేయుడికి కరోనా పాజిటివ్​గా రావడమే ఇందుకు కారణం. ఈ వార్తతో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు బలపరీక్షకు హాజరైన వారందరూ షాక్​కు గురయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ నిర్వహించిన ప్రెస్​మీట్​కూ ఇతను హాజరైనట్లు తెలుస్తోంది.

ఇటీవలే లండన్​ నుంచి వచ్చిన పాత్రికేయుడి కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్​గా రావడం గమనార్హం. అయితే అతని భార్య, కుమారుడికి మాత్రం నెగటివ్​గా వచ్చింది.

16:19 March 25

చైనాను వెనక్కినెట్టిన స్పెయిన్​

స్పెయిన్​లో​ కరోనా విలయతాండవం చేస్తోంది. ఇవాళ ఈ మహమ్మారి ధాటికి స్పెయిన్​లో ఏకంగా 443 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 3,434కు చేరి  చైనా రికార్డును దాటేసింది. 

16:17 March 25

బ్రిటన్​ యువరాజు అయితే నాకేంటి-కరోనా

బ్రిటన్​ యువరాజు చార్లెస్​కు కరోనా సోకింది. పరీక్షల అనంతరం వైద్యులు ఈ విషయం నిర్ధరించారు.

16:13 March 25

వారణాసి ప్రజలతో నేడు మోదీ టెలికాన్ఫరెన్స్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తన సొంత పార్లమెంట్​ నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో ఇవాళ ముచ్చటించనున్నారు ప్రధానమంత్ర నరేంద్రమోదీ. సాయంత్రం 5గంటలకు టెలికాన్ఫరెన్స్​లో ప్రజలతో మాట్లాడుతారు.

16:10 March 25

కరోనా ఎఫెక్ట్‌.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా 

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన వేళ.. తొలిదశ జనాభా లెక్కల (2021) ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే, ఎన్‌పీఆర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

15:45 March 25

తమిళనాట మరో 5

కరోనా వైరస్​ వ్యాప్తి దేశంలో ఎక్కడ చూసినా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా తమిళనాడులో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15:36 March 25

  • అభివృద్ధి చెందిన దేశాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపింది: కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌
  • కరోనా వల్ల అనేక దేశాల్లో మరణాలు సంభవించాయి: ప్రకాశ్ జావడేకర్
  • భారత్‌లో కరోనా ప్రభావం కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది: ప్రకాశ్ జావడేకర్
  • పాలు, నిత్యావసర సరకుల దుకాణాలు నిర్ణీత సమయంలో తెరిచే ఉంటాయి: ప్రకాశ్‌ జావడేకర్
  • సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం: ప్రకాశ్ జావడేకర్
  • క్రమశిక్షణతో వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం: ప్రకాశ్ జావడేకర్
  • ఒక వ్యక్తి మరో వ్యక్తి మధ్య దూరం ఉండేలా చర్యలు చేపట్టాం: ప్రకాశ్ జావడేకర్
  • నిత్యావసర సరకులకు కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వద్దు: ప్రకాశ్ జావడేకర్
  • కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించాం: ప్రకాశ్ జావడేకర్
  • వదంతులు నమ్మొద్దని కోరుతున్నాం: కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌
  • ఈ సమయాన్ని కుటుంబసభ్యులతో గడిపేందుకు కేటాయించండి: ప్రకాశ్ జావడేకర్
  • రూ.2కే కిలో గోధుమలు అందిస్తాం: ప్రకాశ్ జావడేకర్
  • ప్రధాని ప్రకటించిన లాక్‌డౌన్‌ను ప్రజలు పాటిస్తారని నమ్మకం ఉంది: ప్రకాశ్ జావడేకర్
  • లాక్‌డౌన్‌తో కరోనాను కచ్చితంగా అరికట్టవచ్చని విశ్వాసం ఉంది: ప్రకాశ్ జావడేకర్
  • పాత్రికేయులు, వైద్యులు, సిబ్బంది ప్రజాసేవ చేస్తున్నారు: ప్రకాశ్ జావడేకర్
  • ప్రజాసేవ చేస్తున్న పాత్రికేయులు, వైద్యులకు చప్పట్లతో సంఘీభావం తెలిపారు: జావడేకర్‌
  • ఒప్పంద ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తాం: ప్రకాశ్ జావడేకర్
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి: ప్రకాశ్ జావడేకర్
  • కనిపించని శత్రువు కరోనాతో భారత్ యుద్ధం చేస్తోంది: ప్రకాశ్ జావడేకర్
  • లాక్‌డౌన్ అనేది తప్పనిసరి చర్య: ప్రకాశ్ జావడేకర్
  • ప్రజల రక్షణ కోసం తీసుకున్న చర్యకు అందరూ మద్దతుగా నిలవాలి: ప్రకాశ్ జావడేకర్

12:33 March 25

కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇలా..

కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇలా.. 

దిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో మంత్రులు చర్చిస్తున్నారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం ప్రతి ఒక్కరూ పాటించాలని చాటి చెప్పేలా ఈ భేటీలో మంత్రులు నిర్ణీత దూరంలో కూర్చోవడం విశేషం.

11:46 March 25

పాకిస్థాన్​లో 1000కి చేరిన కరోనా కేసులు

పాకిస్థాన్​లో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా మరికొంతమందికి కరోనా సోకినందున.. దేశంలో మొత్తం కొవిడ్​-19 బాధితుల సంఖ్య 1000కి చేరినట్లు పాక్​ ప్రభుత్వం వెల్లడించింది.

11:17 March 25

బిహార్​లో మరో వ్యక్తికి కరోనా..

బిహార్​ రాజధాని పట్నాలో మరో వ్యక్తికి కరోనా సోకింది. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొవిడ్​-19 బారిన పడినవారి సంఖ్య 4కు చేరింది.

11:06 March 25

స్టోర్​ ముందు సామాజిక దూరం

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్​లో ముద్రాలోని ఓ స్టోర్​ ముందు ప్రజలు ఇలా సోషల్​ డిస్టన్స్​ పాటిస్తూ కనిపించారు.

10:42 March 25

దేశంలో మరో ఎనిమిది మందికి  కరోనా

దేశంలో కరోనా మహమ్మారి శాంతించడం లేదు. ఇప్పటికే వందలాదిమందికి సోకిన ఈ వైరస్​.. తాజాగా గుజరాత్​లో మరో ముగ్గురికి, మహారాష్ట్రలో మరో ఐదుగురికి సోకింది. ఫలితంగా కొవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య ఆయా రాష్ట్రాల్లో వరుసగా 38, 112కు చేరింది.

10:27 March 25

కశ్మీర్​లో సామాజిక దూరం ఇలా పాటిస్తున్నారు

జమ్ముకశ్మీర్​లో భారత్​ లాక్​డౌన్​ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వినూత్న చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అనవసరంగా ఇళ్లనుంచి బయటకు వచ్చినవారిని సామాజిక దూరం పాటించేలా.. వృత్తాకార గీతలు గీసి అందులో కూర్చోబెడుతున్నారు.

నేటి నుంచి 21 రోజులపాటు దేశం మొత్తం లాక్​డౌన్​లో ఉంటుందని.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రధాని మోదీ ఇదివరకే వివరించారు.

10:15 March 25

'నిత్యావసర సరకుల రవాణాలో ఆటంకం ఉండకూడదు'

కరోనా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరా చేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమైన సూచనలు చేసింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ రాష్ట్రంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అలాగే నిత్యావసర వస్తువులకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలియజేయాలని తెలిపింది. అవసరమైన వస్తువుల సరఫరాను కొనసాగించేందుకు వీలుగా జిల్లా పరిపాలనాధికారులు, పోలీసుల మధ్య సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని సూచించింది.

09:40 March 25

దేశంలో 562కు కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరికొంతమందికి ఈ మహమ్మారి సోకినందున దేశంలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 562కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 512 యాక్టివ్​ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

09:38 March 25

స్వదేశానికి చేరిన ఇరాన్​లోని 277 మంది భారతీయులు

కరోనా వైరస్​ నేపథ్యంలో ఇరాన్​లో చిక్కుకున్న 277 మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది మోహన్​ ఎయిర్​ విమానం. టెహ్రాన్​ నుంచి బయలుదేరిన ఈ విమానం.. ఈ తెల్లవారుజామునే దిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

06:00 March 25

ప్రపంచవ్యాప్తంగా 20 వేలు దాటిన కరోనా మరణాలు

తమిళనాడు మదురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన 55 ఏళ్ల వయస్సు వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.విజయభాస్కర్​ ట్విట్టర్​ ద్వారా తెలిపారు. అయితే.. అతను స్టెరాయిడ్​ ఆధారిత సీఓపీడీతో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని వెల్లడించారు. దానికి తోడు రక్తపోటు, మధుమేహం వంటివి ఉన్నట్లు పేర్కొన్నారు.  ప్రస్తుతం తమిళనాడులో 17 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Last Updated : Mar 25, 2020, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details